రష్యా విదేశాంగ మంత్రి ఉపన్యాసాన్ని బాయ్ కాట్ చేసిన దేశాలు
ఐక్యరాజ్యసమితి మానవాధికారాల కౌన్సిల్ వేదికగా రష్యా ఒంటరైంది. రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఉపన్యాసం ప్రారంభమవ్వడంతోనే పలు దేశాల నేతలు వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఆయన మాట్లాడిన వీడియోను అధికారులు ప్లే చేయడమే ఆలస్యం.. పలు దేశాల నేతలు సమావేశం నుంచి బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారు. ఇలా చేయడం ద్వారా రష్యాపై ఒత్తిడి పెంచినట్లవుతుందని, రష్యా కాస్త వెనక్కి తగ్గే అవకాశాలున్నాయని ఆ నేతలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ రాయబారి యెవహోనియా ధన్యవాదాలు తెలిపారు. అయితే యమన్, సిరియా, వెనిజులా, ట్యూనిషియా ప్రతినిధులు మాత్రం రష్యా విదేశాంగ మంత్రి వీడియోను విన్నారు.
ఫ్రాన్స్ రాయబారి జెరోమో బెనాఫాంట్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని మండిపడ్డారు. ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని, మానవహక్కుల ఉల్లంఘన కూడా అదే రీతిలో జరుగుతోందని ఆక్షేపించారు. ఇలా వాకౌట్ చేయడం ద్వారా ఉక్రెయిన్ ప్రజలకు తామున్నామన్న భరోసా ఇచ్చినట్లవుతుందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

