అల్ట్రా-వైట్ పెయింట్.. ఇది మీ ఇంటికి వేస్తే సూపర్ కూల్

న్యూయార్క్: ఎండాకాలం ఏసీలు కూడా సరిపోని వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఇళ్లను చల్లగా మార్చేసే ఓ అల్ట్రా-వైట్ పెయింట్‌ను అభివృద్ధి చేశారు అమెరికాకు చెందిన పర్డ్యూ యూనివర్సిటీ పరిశోధకులు. ఈ పెయింట్‌ను ఇంటికి వేస్తే బయటి ఉష్ణోగ్రతల కంటే ఇంట్లో 4.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గిపోతుందని వాళ్లు చెబుతున్నారు. ఈ అల్ట్రా-వైట్ పెయింట్‌పై పడే సూర్య కిరణాలు రిఫ్లెక్ట్ అవడం వల్ల ఇంట్లో ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంతేకాదు ఈ పెయింట్ గ్లోబల్ వార్మింగ్‌ను కూడా రెండు రకాలుగా తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఏసీలు వదిలే కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు సూర్యుడి వేడిని బయటకు పంపేస్తుంది. అక్రిలిక్ పెయింట్‌కు బేరియం సల్ఫేట్‌ను చేర్చడం ద్వారా వీళ్లు 98.1 శాతం రిఫ్లెక్టెన్స్ను సాధించారు. గతంలో కాల్షియం కార్బొనేట్‌ను కలపడం ద్వారా వచ్చిన ఫలితం (95.5 శాతం) కంటే కూడా ఇది మెరుగైన ఫలితాన్ని ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వైట్ పెయింట్లలో 80 నుంచి 91 శాతం వరకూ రిఫ్లెక్టెన్స్ ఉంటుంది. ఈ తాజా పెయింట్ అభివృద్ధికి సంబంధించిన అధ్యయనాన్ని ఏసీఎస్ అప్లైడ్ మెటీరియల్స్ & ఇంటర్ఫేసెస్లో ప్రచురించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

