Gangster Amarpreet: కెనడాలో పంజాబీ మూలాలు ఉన్న గ్యాంగ్‌స్టర్ కాల్చివేత
Gangster Amarpreet: గ్యాంగ్‌స్టర్ అమర్‌ప్రీత్‌ను కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. వాంకోవర్ సిటీలో ఓ వెడ్డింగ్ రిసెఫ్షన్‌కు వెళ్లిన అతనిపై అటాక్ చేశారు. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గ్యాంగ్ వార్ వల్లే ఈ కాల్పుల ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఒట్టావా: కెనడాలో పంజాబీ మూలాలు ఉన్నగ్యాంగ్స్టర్(Gangster)ను ఓ వెడ్డింగ్ రిసెప్షన్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన వాంకోవర్ సిటీలో జరిగింది. గ్యాంగ్ వార్ వల్లే ఈ కాల్పుల ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. కెనడా పోలీసులు వాంటెడ్ జాబితాలో ఆ 28 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. గ్యాంగ్‌స్టర్ అమర్‌ప్రీత్ సమ్రా(Amarpreet Samra)ను ఫ్రేజర్ స్ట్రీట్ వద్ద షూట్ చేశారు. సమ్రాతో పాటు ఆయన సోదరుడు రవీందర్ కూడా గ్యాంగ్‌స్టరే. ఆ ఇద్దరికీ వెడ్డింగ్ రిసెప్షన్ ఆహ్వానం ఉంది. యూఎన్ గ్యాంగ్‌తో వాళ్లకు లింకులు ఉన్నాయి.
గుర్తు తెలియని కొందరు వ్యక్తులు హాల్లోకి వచ్చి డీజీ మ్యూజిక్ ఆపేయాలని కోరారని, ఆ సమయంలో వేదిక వద్ద సుమారు 60 మంది అతిథులు ఉన్నట్లు తెలుస్తోంది. సౌత్ వాంకోవర్ బాంకెట్ హాల్ సమీపంలో ఓ వ్యక్తిని కాల్చివేసినట్లు పోలీసులకు సమాచారం వెళ్లింది. పెట్రోలింగ్ ఆఫీసర్లు సీపీఆర్ చేసినా తీవ్ర రక్తస్రావం వల్ల ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
తమ ప్రాంతంలో జరుగుతున్న కాల్పుల ఘటనకు ఆ గ్యాంగ్‌స్టర్‌తో లింకు ఉన్నట్లు బ్రిటీష్ కొలంబియా పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

