ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డులు క్లియర్ చేయండి..
వాషింగ్టన్: గ్రీన్ కార్డు లేదా పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్లను ఆరు నెలల్లోగా క్లియర్ చేయాలని అమెరికా అధ్యక్ష సలహా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు బైడెన్‌కు తమ ప్రతిపాదనలను పంపింది. ఒకవేళ బైడెన్ సర్కార్ ఆ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపితే అప్పుడు వేలాది మంది భారతీయులకు గ్రీన్ కార్డు లభించే అవకాశాలు ఉన్నాయి. ఏషియన్ అమెరికన్లు, స్థానిక హవాయి ప్రజలు, పసిఫిక్ దీవులకు చెందిన వాళ్లతో ఏర్పడిన అడ్వైజరీ కమిషన్ చేసిన ప్రతిపాదనలను ఆమోదం కోసం వైట్‌హౌజ్‌కు పంపనున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలకు క్లియరెన్స్ ఇస్తే.. అప్పుడు ఎన్నో దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్నవారికి గ్రీన్ కార్డు వచ్చే ఛాన్సు ఉంటుంది. భారతీయ అమెరికన్ నేత అజయ్ జైన్ భుటోరియా నేతృత్వంలోని బృందం ఈ ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనకు 25 మంది కమీషనర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2021లో కేవలం 65,452 మందికి మాత్రమే గ్రీన్ కార్డు జారీ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

