ప్రిన్స్ ఫిలిప్ వీలునామాకు సీల్.. 90 ఏళ్ల తర్వాతే ఓపెన్

లండన్: బ్రిటీష్ రాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు చెందిన వీలునామాను మరో 90 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచాలంటూ గురువారం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. క్వీన్ ఎలిజబెత్ హుందాతనానికి సూచకంగా ఆ వీలునామాను తెరవరాదు అని హైకోర్టు చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్లో 99 ఏళ్ల వయసులో ప్రిన్స్ ఫిలిప్ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. రాచరిక కుటుంబంలో ఎవరైనా సీనియర్ సభ్యులు మరణిస్తే, వారికి చెందిన వీలునామాపై హైకోర్టులో ఉన్న ఫ్యామిలీ డివిజన్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని శతాబ్ధాల నుంచి ఈ ఆచారం కొనసాగుతున్నది. ప్రస్తుతం ఫ్యామిలీ డివిజన్ కోర్టు అధ్యక్షుడిగా ఉన్న సర్ ఆండ్రూ మెక్ ఫార్లేన్ .. ప్రిన్స్ ఫిలిప్ వీలునామాపై తీర్పును ప్రకటించారు. ఫిలిప్ వీలునామాను సీలు చేసి, 90 ఏళ్లు తర్వాత దాన్ని తెరవాలంటూ మెక్ఫార్లేన్ తన తీర్పులో వెల్లడించారు. ప్రిన్స్ ఫిలిప్ తన వీలునామాలో ఏం రాశారో ఎవరికీ తెలియదని జడ్జి తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

