Ukraine PM: ఉక్రెయిన్ ప్రధాని యులియా రాజీనామా
Ukraine PM: ఉక్రెయిన్ ప్రధాని యులియా స్విరిడెంకో రాజీనామా చేశారు. ఉక్రెయిన్ మంత్రిమండలిలో ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ భారీ మార్పులు చేశారు. దీంతో ఆమె తన పదవి నుంచి తప్పుకున్నారు. అధ్యక్షుడు జెలెన్స్కీ తనకు కొత్త బాధ్యతలు అప్పగించినట్లు ఆమె చెప్పారు.
కీవ్: ఉక్రెయిన్ ప్రధాని(Ukraine PM) యులియా స్విరిడెంకో రాజీనామా చేశారు. ఉక్రెయిన్ మంత్రిమండలిలో ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ భారీ మార్పులు చేశారు. దీంతో ఆమె తప్పుకున్నారు. అధ్యక్షుడు జెలెన్స్కీ తనకు కొత్త బాధ్యతలు అప్పగించినట్లు ఆమె చెప్పారు. గతంలో ఉక్రెయిన్ ఆర్థిక మంత్రిగా స్విరిడెంకో చేశారు. అయితే 2025 జూలైలో ఆమెకు ప్రధాని బాధ్యతలు అప్పగించారు. అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజ ఒప్పందంలో కీలక పాత్ర పోషించినట్లు ఆమెపై గతంలో ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. సంక్లిష్ట సమయంలో ఉక్రెయిన్‌కు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు స్విరిడెంకో తన సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.
తన తదుపరి కార్యాచరణ గురించి జెలెన్స్కీతో చర్చించినట్లు ఆమె తెలిపారు. తన రాజకీయా వ్యూహాన్ని మార్చుతున్నానని, దీనిలో భాగంగా ప్రధాని రాజీనామా చేస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మార్షియల్ చట్టం ప్రకారం జెలెన్స్కీ బాధ్యతల నుంచి తప్పుకోలేదు. యుద్ధ సమయంలో ఎన్నికలు నిర్వహించరు కాబట్టి, ఆయన కేవలం తన క్యాబినెట్లో మార్పులు చేశారు. పరిపాలనలో కొత్త వారికి అవకాశం కల్పించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

