ఇండియాకు వ్యాక్సిన్ సరఫరా చేయాల్సిందే.. అమెరికాపై పెరుగుతున్న ఒత్తిడి

వాషింగ్టన్: ఇండియాలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ ఆస్ట్రాజెనెకా, ఇతర కొవిడ్ వ్యాక్సిన్లను పంపించాలని అమెరికాలోని బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్‌తోపాటు అక్కడి చట్టసభల ప్రతినిధులు, ప్రముఖ ఇండియన్ అమెరికన్లు బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న ఇండియా, బ్రెజిల్‌లాంటి దేశాలకు స్టోరేజ్‌లో ఉన్న కోట్లాది వ్యాక్సిన్ డోసులను పంపించాలని యూఎస్ చాంబర్ డిమాండ్ చేస్తోంది.
ఈ వ్యాక్సిన్లు అమెరికా కంటే ఆ దేశాలకే ఇప్పుడు ఎక్కువ అవసరమని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మైరన్ బ్రిలియాంటె అన్నారు. జూన్ కల్లా అమెరికాలోని వ్యాక్సిన్ తయారీదారులు ప్రతి అమెరికన్‌కు సరిపడా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయగలరని, అలాంటప్పుడు ఎక్కువగా ఉన్న వ్యాక్సిన్లు అమెరికాకు అవసరం లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం మహమ్మారి నుంచి ఎవరో పూర్తిగా బయటపడలేదని ఆయన అభిప్రాయపడ్డారు. కొవిడ్‌కు వ్యతిరేక పోరాటంలో అంతర్జాతీయ సమాజం మద్దతు కావాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కోరిన తర్వాత యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన విడుదల చేసింది.
ఇండియా ప్రపంచానికి సాయం చేస్తుందని, అందువల్ల ఇండియాకు కచ్చితంగా సాయం చేయాల్సిందే అని జైశంకర్ కోరారు. ఇండియాకు అత్యవసరమైన మందులను సరఫరా చేయడంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెలీనా పోర్టర్ చెప్పారు. ఇండియాలో ఉన్న కొవిడ్ పరిస్థితులు ప్రపంచానికే ఆందోళనకరమని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రతినిధి రషీదా తాలిబ్ కూడా దీనిపై స్పందిస్తూ.. ఇండియాకు అమెరికా కచ్చితంగా సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక భారతీయ అమెరికన్లు, బైడెన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్లు కూడా ఇండియాకు సాయం చేయాలని అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
City Park | అమ్మకానికి సిటీ పార్క్.. బోగస్ రియల్ ఎస్టేట్ కంపెనీ తరహాలో హెచ్ఎండీఏ వ్యవహారం
Bigg Boss 10 | హౌస్ చివరి కెప్టెన్‌గా దేబ్జానీ.. వర్షిణి, త్రిగుణ్ మధ్య మరోసారి భారీ హైడ్రామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

