వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ సోమవారం కీలక రూలింగ్‌ను ఆమోదించారని వాటికన్ తెలిపింది. స్వలింగ జంటలకు ఆశీర్వాదాల కార్యక్రమాన్ని రోమన్ క్యాథలిక్ మత బోధకులు నిర్వహించేందుకు ఆమోదం తెలిపారని చెప్పింది. అయితే నిత్యం చర్చిలో జరిగే ప్రార్థనల్లో భాగం కానంత వరకు ఈ కార్యక్రమాలను నిర్వహించవచ్చునని చెప్పినట్లు తెలిపింది. ఇది దేవుడు అందరినీ స్వాగతిస్తాడని చెప్పే సంకేతం మాత్రమేనని స్పష్టం చేసినట్లు వివరించింది.