Joseph Boakai | లైబీరియా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జోసఫ్ బోయకై
ఆఫ్రికా దేశమైన లైబీరియా (Liberia) నూతన అధ్యక్షుడిగా జోసఫ్ బోయకై (Joseph Boakai) ఎన్నికయ్యారు. మాజీ ఫుట్‌బాల్ స్టార్, ప్రస్తుత అధ్యక్షుడు జార్జ్ వీహ్‌పై (George Weah) 20,567 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు.
మన్రోవియా: ఆఫ్రికా దేశమైన లైబీరియా (Liberia) నూతన అధ్యక్షుడిగా జోసఫ్ బోయకై (Joseph Boakai) ఎన్నికయ్యారు. మాజీ ఫుట్‌బాల్ స్టార్, ప్రస్తుత అధ్యక్షుడు జార్జ్ వీహ్‌పై (George Weah) 20,567 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత జాతీయ ఎన్నికల సంఘం (NEC) ఈ మేరకు ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల్లో వీహ్కు 49.36 శాతం ఓట్లు రాగా, బోకాయ్ 50.64 శాతం ఓట్లతో గెలుపొందారని వెల్లడించింది. వీహ్ ఇప్పటికే తన ఓటమిని అంగీకరించారు.
ఆరేండ్ల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వీహ్ విజయం సాధించారు. దీంతో లైబీరియా అధ్యక్షుడైన తొలి ఆఫ్రికన్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా (African Footballer) రికార్డు సృష్టించారు. అయితే తనపై పెట్టుకున్న ప్రజల నమ్మకాన్ని ఈ ఫిఫా వరల్డ్ ప్లేయర్, బాలన్ డీఓఆర్ అవార్డుల విజేత నిలబెట్టుకోలేకపోయారు. ఆయన ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీహ్ కాలంలో దేశంలో ఎలాంటి మార్పూ రాలేని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. కాగా, నూతన అధ్యక్షుడికి.. వీవ్ శుభాకాంక్షలు తెలిపారు. తన పార్టీ ఓడిపోయిందని, లైబీరియా ప్రజలు గెలుపొందారని చెప్పారు. ప్రతిఒక్కరు మార్పును అంగీకరించాల్సిందేనని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో ‘ది ప్యారడైజ్’.. ఏకంగా 24 నిమిషాల సీన్లు కట్, నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త వెర్షన్!
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

