టోరంటో, మే 8: ప్రపంచంలోనే తొలిసారిగా మొక్క ఆధారిత వ్యాక్సిన్ తయారైంది. ఇది ఐదు కొవిడ్ వేరియంట్ల ప్రభావాలకు వ్యతిరేకంగా 70% సమర్థవంతంగా పనిచేస్తున్నదని కెనడియన్ బయోటెక్నాలజీ కంపెనీ ‘మెడికాగో’ పరిశోధకులు వెల్లడించారు.
ఈ మేరకు మానవులపై నిర్వహించిన ముందస్తు క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో తేలిందని పేర్కొన్నారు. మొక్కల్లో ఉత్పత్తయ్యే కరోనా వైరస్ లాంటి కణాలు ఈ వ్యాక్సిన్లో ఉంటాయి. ఇవి వ్యాక్సిన్లు మరింత మెరుగ్గా పనిచేయడంలో సహాయపడే ఔషధం ‘ఎఎస్ఓ3’తో కలిసి ఉంటాయి.