కలలో కసరత్తు!

- నిద్రపోతూ భిన్న అంశాలపై అభ్యసన
- ఇంటర్వ్యూ, క్రికెట్ ఇలా ఏ అంశంమైనా సరే
- ఏఐ సాంకేతికతతో కలలోనే తర్ఫీదు పూర్తి
- అమెరికా పరిశోధకుల అధ్యయనం.. సత్ఫలితాలు
జాబ్ ఇంటర్వ్యూ లేదా క్రికెట్లో నెగ్గేందుకు అవసరమైన కసరత్తు, మెళకువలను కలలో (డ్రీమ్‌లో) అభ్యసన చేస్తే ఎలా ఉంటుంది? ఇదేదో హాలీవుడ్ సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నది కదూ! కానీ, నిజం. కెరీర్ అభివృద్దికి అవసరమైన మెళకువలను కలలో కూడా పూర్తిచేసుకోవచ్చని తాజా అధ్యయనం చెబుతున్నది. అదే ‘డ్రీమ్ టు బెటర్ పర్ఫామెన్స్’
ఏమిటీ ‘డ్రీమ్ టు బెటర్ పర్ఫామెన్స్’?
ఒక పని చేసేటప్పుడు గతంలో మనం చేసిన పొరపాట్లను గుర్తించి వాటిని సవరిస్తూ.. భవిష్యత్తులో ఆ పని విజయవంతంగా పూర్తవ్వడానికి అవసరమైన కసరత్తును మేళవిస్తూ.. కలల రూపంలో ఆవిష్కరించే అభ్యసన ప్రక్రియే ‘డ్రీమ్ టు బెటర్ పర్ఫామెన్స్’. ర్యాపిడ్ ఐ మూమెంట్ (ఆర్ఈఎం)లో వచ్చే కలల్లో ఇది కొనసాగుతుంది.
కలలో ఎలా నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు?
కలల ద్వారా నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలంటే, ఏ అంశంలో మెళకువలు సాధించాలనుకుంటున్నారో.. దానికి సంబంధించిన కసరత్తును గతంలో కనీసం ఒక్కసారైనా పూర్తి చేసి ఉండాలని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విల్లే పరిశోధకులు తెలిపారు. గతంలో చేసిన తప్పులు అప్పటికే మెదడులో రిజిస్టరై ఉండటంతో.. కలలో తర్ఫీదు పొందే సమయంలో ఆ తప్పులు పునరావృతం కాకుండా ఉంటుందన్నారు. 48 మంది విద్యార్థులపై చేసిన అధ్యయనంలో సత్ఫలితాలు వచ్చాయన్నారు. తర్ఫీదు పొందాలనుకున్న అంశానికి సంబంధించిన కలలు వచ్చేలా విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సంకేతాలను పంపించామని తెలిపారు. నిజజీవితంలోని అభ్యసనతో పోలిస్తే, కలలో వారు మరింత మెరుగ్గా కసరత్తు పూర్తిచేశారన్నారు.
ఆర్ఈఎం అంటే
నిద్ర పోయే సమయాన్ని ఆర్ఈఎం, నాన్-ఆర్ఈఎంగా పరిశోధకులు విభజించారు. రెప్ప కింద కండ్లను అటూ, ఇటూ ఆడిస్తూ నిద్రపోయే ప్రక్రియను ఆర్ఈఎం అంటారు. కొన్ని సెకండ్ల నుంచి గరిష్ఠంగా 20 నిమిషాలు మాత్రమే ఈ స్థితి ఉంటుంది. ఇప్పుడు కనే కలల్ని మాత్రమే గుర్తుంచుకోగలం. గాఢ నిద్రలోకి వెళ్లే స్థితిని నాన్-ఆర్ఈఎంగా పిలుస్తారు. ఈ స్థితిలో కన్న కలలు గుర్తుండవు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

