Pigeon | దారి తప్పి అమెరికా చేరిన పావురం.. 4వేల మైళ్ల ప్రయాణం!
చాలామంది పోటీల కోసం పావురాలను పెంచుతుంటారు. ఈ సంప్రదాయం పాశ్చాత్య దేశాల్లో కూడా ఉంది. అయితే ఒక్కోసారి ఈ పావురాలు దారి తప్పి ఎటో వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు అలాంటి ఘటనే యూకేలో వెలుగు చూసింది. ఛానెల్ ఐలాండ్స్‌లో గార్న్సే ప్రాంతం నుంచి టైన్సైడ్కు పావురాల రేస్ జరిగింది.
ఈ రేసులో పాల్గొన్న బాబ్ అనే పావురం.. దారి తప్పి లక్ష్యాన్ని చేరుకోలేదు. దానికోసం వెతికినా ప్రయోజనం లేకపోయింది. తన పావుర ఎక్కడకువ వెళ్లిందా? అని యజమాని అలన్ టాడ్ ఆందోళన చెందాడు. చివరకు అది అమెరికాలోని అలబామాలో కనిపించింది. ఒక వ్యక్తి ఇంటి తోటలో చేరి, అక్కడి నుంచి వెళ్లేందుకు ఇష్టపడలేదా పావురం.
దాంతో జంతువుల సంరక్షణ ఏజెన్సీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అక్కడకు వచ్చిన అధికారులు.. పావురాన్ని తీసుకెళ్లి చెక్ చేస్తుండగా.. దాని కాళ్లకు వేరు వేరు రంగుల బ్యాండ్లు ఉండటాన్ని చూసిన వాళ్లకు ఆ పావురం బ్రిటన్‌కు చెందిందని అర్థమైంది. కొంత బరువు తగ్గినప్పటికీ పావురం ఆరోగ్యంగానే ఉందని వెటర్నరీ డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత దాని యజమానిని గుర్తించి.. వీడియో కాల్ చేసి ఆ పావురాన్ని చూపించారు.
త్వరలోనే అలన్ అమెరికా వెళ్లి తన పావురాన్ని తిరిగి తెచ్చుకుంటాడట. తనపావురం దారి తప్పి ఏదో పడవ ఎక్కేసి ఉంటుందని, అంతేకానీ 4 వేల మైళ్లు ఎగురుకుంటూ వెళ్లి ఉండదని అలన్ చెప్పాడు. బాబ్ ఒంటిపై ఉన్న ఆయిల్ మరకలు చూస్తుంటే అదేదో ఆయిల్ షిప్ అయ్యుండే ఛాన్సులు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా త్వరలోనే బాబ్, అలన్ కలవబోతున్నారన్నమాట.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- pigeon
- race
- Telugu News
- UK
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

