Kangaroo | ప్రేమగా పెంచుకుంటే.. ప్రాణాలు తీసింది!
Kangaroo | చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆ కంగారూను తెచ్చి పెంచుకున్నాడా వృద్ధుడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచిన ఆ కంగారూనే చివరకు అతన్ని చంపేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వెలుగు చూసింది.
చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆ కంగారూను తెచ్చి పెంచుకున్నాడా వృద్ధుడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచిన ఆ కంగారూనే చివరకు అతన్ని చంపేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వెలుగు చూసింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని రెడ్మాండ్లో నివశించే 77 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన గాయాలతో స్థానికుల కంటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని వృద్ధుడికి ప్రథమ చికిత్స అందించేందుకు ప్రయత్నించారు.
అయితే వాళ్లు అతన్ని చేరుకోకుండా కంగారూ అడ్డుపడింది. దాంతో అధికారులు దాన్ని కాల్చి చంపేశారు. అనంతరం వృద్ధుడికి చికిత్స చేసినప్పటికీ అతను ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. కంగారూలు ఇంతలా దాడి చేసి ఒక మనిషిని చంపేయడం గత 86 ఏళ్లలో ఇదే తొలిసారని తెలుస్తోంది. గతంలో అంటే 86 ఏళ్ల క్రితం రెండు కుక్కలను కంగారూ బారినుంచి తప్పించే క్రమంలో ఒక 38 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడి కన్నమూశాడు. మళ్లీ ఇలా కంగారూ దాడిలో వ్యక్తి మరణించడం ఇదే తొలిసారి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Australia
- Kangaroo
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

