బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిన తర్వాత ఆ దేశ ప్రధానిగా లిజ్ ట్రస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ తర్వాతి ప్రధాని ఎవరనే విషయంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మళ్లీ బరిలో నిలుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే కేబినెట్ మినిస్టర్ పెన్నీ మోర్డాంట్ అధికారికంగా తను ప్రధాని రేసులో ఉన్నట్లు ప్రకటించారు. బోరిస్ జాన్సన్‌కు కన్జర్వేటివ్ పార్టీ నేతలు భారీగా మద్దతు పలుకుతున్నారని, ఆయన్నే పీఎం రేసులో ఉంచాలని భావిస్తున్నారని సమాచారం. దీనిలో భాగంగానే మళ్లీ ఈ రేసులో నిలిచేందుకు ప్రయత్నిస్తున్న రిషి సునాక్‌ను పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా కోరడం జరిగిందట.