న్యూడ్ ఫొటోలు షేర్ చేసిన ప్రయాణికులు… ఫ్లైట్‌ను వెనక్కి మళ్లిస్తానని పైలట్ బెదిరింపు
వాషింగ్టన్: విమానం ఆకాశంలో ఎగురుతుండగా కొందరు ప్రయాణికులు న్యూడ్ ఫొటోలను షేర్ చేశారు. ఈ విషయం పైలట్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ చర్యను ఆపకపోతే విమానాన్ని వెనక్కి మళ్లిస్తానని బెదిరించాడు. అమెరికాలో ఈ సంఘటన జరిగింది. సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన విమానం గాల్లో ప్రయాణిస్తున్నది. అయితే కొందరు ప్రయాణికులు ఆపిల్ సంస్థ ఐఫోన్‌లోని ఎయిర్‌డ్రాప్ ఫీచర్ ద్వారా నగ్న ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కనించేలా సెటింగ్ చేసుకున్న వారందరికీ న్యూడ్ ఫొటోలు షేర్ అవుతున్నాయి.
కాగా, ఐఫోన్‌కు న్యూడ్ ఫోటోలు రావడాన్ని గమనించిన ఒక వ్యక్తి దీని గురించి ఆ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆ విమాన పైలట్ దీనిపై స్పందించాడు. ప్రయాణికులనుద్దేశించి మైక్‌లో ప్రత్యేకంగా ఎనౌన్స్మెంట్ చేశాడు. ఎయిర్‌డ్రాప్ ఫీచర్ ద్వారా నగ్న ఫొటోలు షేర్ చేయడాన్ని ఆపాలని ప్రయాణికులను కోరాడు. లేనిపక్షంలో విమానాన్ని వెనక్కి మళ్లిస్తానని బెదిరించాడు. విమానం ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు ఇలా జరిగితే పరిణామాలు మరోలా ఉండేవని హెచ్చరించాడు.
మరోవైపు ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఈ మొత్తం వ్యవహారాన్ని మొబైల్లో రికార్డు చేశాడు. అనంతరం ట్విట్టర్లో ఫోస్ట్ చేశాడు. ఈ సంఘటన వైరల్ కావడంతో సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థ స్పందించింది. ఈ సమస్యను తమ సిబ్బంది చాకచక్యంగా పరిష్కరించారని ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

