ఒట్టావా, డిసెంబర్ 10: ఫోర్ట్‌నైట్ గేమ్ వల్ల తమ పిల్లలు నిద్రాహారాలు, తిండీతిప్పలు మానేశారని ఆ గేమ్ నిర్వాహకులపై కొందరు తల్లిదండ్రులు కోర్టులో దావా వేశారు. ఆ గేమ్ పిల్లలను బానిసల్లా మారుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు గత రెండేండ్లలో 7,700 గంటలు ఆటలోనే ఉన్నాడని, సగటున రోజుకు 3 గంటల పాటు ఫోర్ట్‌నైట్ గేమ్‌లో మునిగిపోయాడని ఓ తండ్రి వెల్లడించాడు.
తన కుమారుడు 7 వేల గంటలు ఈ ఆటే ఆడాడని మరో బాలుడి తండ్రి గోడు వెళ్లబోసుకొన్నాడు. దీనిపై స్పందించిన జడ్జి.. పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న ఇలాంటి అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.