లాహోర్ : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. లాహోర్‌లో ఆయన నివాసంలో ఉగ్రవాదులు నక్కారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వీరిని 24 గంటల్లో అప్పగించాలని విధించిన గడువు ముగియడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు భారీ ఆయుధాలతో ఇమ్రాన్ ఇంటి వద్దకు చేరుకున్నాయి. ఆయన నివాసానికి వెళ్లే దారులన్నీ పోలీసులు మూసివేశారు. దీంతో ఏ క్షణాన్నైనా పోలీసులు ఇమ్రాన్ ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కేవలం తన పార్టీని అణచివేసేందుకు ఇది ఒక సాకు మాత్రమేనని ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు.