హెడ్‌ఫోన్ పెట్టుకోలేకపోయిన పాక్ ప్రధాని.. పుతిన్ ముసిముసి నవ్వులు.. వీడియో
Pakistan PM Shehbaz Sharif: ఉజ్జెకిస్తాన్‌లోని సమర్ఖండ్ నగరంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశాలకు హాజరైన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి ద్వైపాక్షిక సంభాషణల్లో పాల్గొన్నారు. ఇద్దరి మధ్య ముఖాముఖి చర్చ జరుగుతున్న సమయంలో ఓ ఆ
సమర్ఖండ్: ఉజ్జెకిస్తాన్‌లోని సమర్ఖండ్ నగరంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశాలకు హాజరైన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి ద్వైపాక్షిక సంభాషణల్లో పాల్గొన్నారు. ఇద్దరి మధ్య ముఖాముఖి చర్చ జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. పాక్ ప్రధాని షెహబాజ్ తన వద్ద ఉన్న హెడ్ఫోన్లను సరైన రీతిలో పెట్టుకోలేకపోయాడు. హెడ్‌ఫోన్‌ను చెవిలో పెట్టుకునేందుకు పాక్ ప్రధాని తడబడ్డాడు. దాన్ని చూసిన పుతిన్ తనలో తాను నవ్వుకున్నారు. ఇక మరోసారి పాక్ ప్రధాని ప్రయత్నం చేసిన ఫలితం రాలేదు. ఈలోగా మళ్లీ హెడ్‌ఫోన్ మళ్లీ చెవి నుంచి కింద పడిపోయింది. ఆ సమయంలో పుతిన్ మరోసారి నవ్వాడు. పుతిన్ నవ్వులు ఆయన మైక్‌లో వినిపించాయి కూడా. హెడ్‌ఫోన్ పెట్టుకోలేకపోయిన పాక్ ప్రధాని..ఓ అధికారి సాయం కూడా కోరారు. ఇదంతా లైవ్ కెమెరాలో రికార్డు అయ్యింది. హెడ్‌ఫోన్ పెట్టులేకపోయిన ప్రధాని షెహబాజ్ దేశం పరువు తీశారంటూ ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇదే.
This CrimeMinister is a constant embarrassment for Pakistan. Even President Putin had to eventually just laugh at this clumsy man. Pathetic. This is what conspirators wanted? To have by design a politician who would not only be a crook but also a pathetic apology for a PM? pic.twitter.com/mmEhLY7RZg
— Shireen Mazari (@ShireenMazari1) September 15, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

