పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన అధ్యక్షుడు.. 90 రోజుల్లోనే ఎన్నికలు
పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ పాకిస్తాన్ రాష్ట్రపతి అరిఫ్ అల్వీ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలంటూ ప్రధాని ఇమ్రాన్ సిఫార్సు చేసిన కేవలం 30 నిమిషాల్లోనే రాష్ట్రపతి రద్దు చేయడం ఆసక్తికర పరిణామం. ఇక.. 90 రోజుల్లో పాకిస్తాన్లో ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యాంగంలోని 224 ఆర్టికల్ ప్రకారం ప్రధానిగా ఇమ్రాన్ తన విధులను నిర్వర్తిస్తారని మంత్రి ఫవాద్ చౌధురి ప్రకటించారు. అయితే కేబినెట్ మాత్రం రద్దైందని ఆయన పేర్కొన్నారు.
పాకిస్తాన్లో ఆదివారం నుంచి వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ ఖాసీం ఖాన్ సూరీ వ్యతిరేకించారు. తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అయితే స్పీకర్ అసద్ ఖైసర్ పైన కూడా ప్రతిపక్షాలు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడంతో డిప్యూటీ స్పీకర్ సభకు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సమయంలో మాత్రం సభలో ప్రధాని ఇమ్రాన్ లేరు.
మరోవైపు దేశ అసెంబ్లీని రద్దు చేయాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ అధ్యక్షుడు అరిఫ్ అల్వీని కోరారు. ముందస్తు ఎన్నికలు జరగాలని ఆయన పిలుపునిచ్చారు. అసెంబ్లీని రద్దు చేయాలని నేను దేశ అధ్యక్షుడికి లేఖ రాశాను. ప్రజాస్వామిక విధానంలోనే ఎన్నికలు జరగాలి. ఎన్నికలకు సిద్ధం కావాలని నేను ప్రజలను కోరుతున్నాను. ప్రజాస్వామ్యంగా దేశంలో ఎన్నికలు జరిగితే ఎవరి భవిష్యత్తు ఏంది అనేది ప్రజలే నిర్ణయిస్తారు. అంతిమ నిర్ణేతలు ప్రజలే అని ఇమ్రాన్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

