Kabul Blasts: కాబూల్ పేలుళ్ల మాస్టర్‌మైండ్ ఆ పాకిస్థానీయేనా?
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర గురువారం రెండు ఆత్మాహుతి దాడులు( Kabul Blasts ) జరిగిన విషయం తెలుసు కదా.

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర గురువారం రెండు ఆత్మాహుతి దాడులు( Kabul Blasts ) జరిగిన విషయం తెలుసు కదా. అయితే ఈ దాడుల వెనుక ఓ పాకిస్థానీ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేలుళ్లకు తామే బాధ్యులమని ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ ఐఎస్ఐఎస్ పాకిస్థాన్ హెడ్ అయిన ఎమిర్ మవాలవీ అబ్దుల్లా ఫరూఖీయే ఈ దాడుల్లో కీలకపాత్ర పోషించినట్లు ఆఫ్ఘన్ వర్గాలు వెల్లడించాయి.
ఎవరీ మవాలవీ ఫరూఖీ?
ఫరూఖీకి గతంలో లష్కరే తోయిబా, తెహ్రీకే తాలిబన్లతో సంబంధాలు ఉన్నాయి. 2019, ఏప్రిల్‌లో ఇస్లామిక్ స్టేట్ పాకిస్థాన్ హెడ్‌గా మవాలవి జియావుల్ హక్ అలియాస్ అబు ఫరూఖీ ఖోర్సానీ స్థానంలో ఫరూఖీ నియమితుడయ్యాడు. 2020లో కాబూల్ గురుద్వారాలో జరిగిన పేలుడులో ఇతడే ప్రధాన సూత్రధారి. ఈ విషయాన్ని అతడు కూడా అంగీకరించాడు. పాకిస్థానే ఈ పేలుళ్లకు కారణమనీ ఫరూఖీ చెప్పాడు. కాబూల్ జైల్లో ఉన్న ఇతన్ని తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర ఉగ్రవాదులతో కలిపి విడిచిపెట్టారు. ఇప్పుడితడే ఈ కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేసినట్లు ఆఫ్ఘన్ వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

