Ferry capsized | ఇండోనేషియా తీరంలో బోటు మునక.. 15 మంది మృతి, 19 మంది గల్లంతు
Ferry capsized | ఇండోనేషియాలోని సులవేసి దీవి తీరంలో ప్రయాణికులతో వెళ్తున్న బోటు మునిగిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మందిని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. ఇంకో 19 మంది గల్లంతయ్యారు.
సులవేసి: ఇండోనేషియాలోని సులవేసి దీవి తీరంలో ప్రయాణికులతో వెళ్తున్న బోటు మునిగిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మందిని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. ఇంకో 19 మంది గల్లంతయ్యారు. సామర్థ్యానికి మించి జనం ఎక్కడమే బోటు మునకకు కారణమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.
రెస్క్యూ చేసిన 33 మందిలో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సులవేసి దీవి నుంచి బయలుదేరిన తర్వాత కేవలం 1 కిలో మీటర్ ప్రయాణం అనంతరం పడవ ప్రమాదానికి గురైందని అధికారులు చెప్పారు. కేవలం 20 నిమిషాల ప్రయాణం మాత్రమే సాగిందన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కాగా, ఇండోనేషియా మొత్తం దీవుల సముదాయం. ఆ దేశంలో చిన్నాచితకా కలిపి దాదాపు 17 వేల దీవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీవుల మధ్య ప్రయాణానికి పడవలో ప్రధాన రవాణా సదుపాయంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అత్యాశతో సామర్థ్యానికి మించి జనాలను ఎక్కించుకుంటున్నారు. దాంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

