లండన్ : దీర్ఘకాలిక కొవిడ్-19తో బాధపడుతున్న రోగుల్లో 200కు పైగా లక్షణాలను గుర్తించినట్టు బ్రిటన్ పరిశోధకుల నేతృత్వంలోని ఓ అధ్యయనం పేర్కొంది. ఆయాసం, నీరసం, అశాంతి, గుండెదడ, లైంగిక బలహీనత, జ్ఞాపక శక్తి సమస్య, నెలసరిలో మార్పులు, బ్రెయిన్ ఫాగ్, చెవిలో మోత, వణుకు వంటి లక్షణాలు ఈ జాబితాలో ఉన్నట్టు వెల్లడించింది. శరీరంలోని 10 ముఖ్య అవయవ వ్యవస్థలపై ఇవి ప్రభావం చూపుతున్నట్టు వివరించింది.