వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డు (95 ఆస్కార్ వేడుక) ప్రదానం వేడుక హోస్ట్‌గా జిమ్మీ కిమ్మెల్ పేరు ప్రకటించింది అవార్డ్ కమిటీ. దీంతో జి్మ్మి మూడోసారి ఆస్కార్ వేడుకకి హోస్ట్‌గా చేయనున్నాడు. 2017, 2018లో జరిగిన ఆస్కార్ వేడుకలకు జిమ్మీ హోస్ట్‌గా చేశాడు. తనకు ఆహ్వానం అందడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మూడోసారి ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్‌కి హోస్ట్‌గా ఆహ్వానం రావడం గొప్ప గౌరవమా లేదంటే ఏదైనా ఉచ్చులాంటిదా? అనేది తెలియట్లేదు. ఏదిఏమైనా అకాడమీ నన్ను సంప్రదించినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని జిమ్మీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిమ్మీని ఆస్కార్ అవార్డ్స్ 2023 హోస్ట్‌గా ఎంపిక చేసిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అకాడమీ. జిమ్మీ అమెరికన్ టీవీ హోస్ట్‌గా బాగా పాపులర్. ఇతను కమెడియన్, రైటర్ కూడా.
95వ ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. అయితే, పోయిన ఏడాది ఆస్కార్ వేడుక చర్చనీయంగా మారిన విషయం తెలిసింది. హోస్ట్ క్రిస్ రాక్ (అమెరికన్ కమెడియన్), విల్ స్మిత్ భార్య గురించి చేసిన కామెడీ నచ్చక స్మిత్ వేదికమీదే అతని చెంప చెళ్లుమనిపించాడు. ఆ సంఘటనతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.