చైనాతో తైవాన్ పునరేకీకరణను ఎవరూ అడ్డుకోలేరు
చైనాతో తైవాన్ పునరేకీకరణను ఎవరూ అడ్డుకోలేరని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మంగళవారం ప్రకటించారు. 2.3 కోట్ల జనాభా గల తైవాన్ లోపలి, వెలుపలి స్వాతంత్య్ర అనుకూల శక్తులకు చైనా అధ్యక్షుడు తన నూతన సంవత్సర సందేశంలో గట్టి హెచ్చరికలు జారీచేశారు.
- చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
బీజింగ్, డిసెంబర్ 31: చైనాతో తైవాన్ పునరేకీకరణను ఎవరూ అడ్డుకోలేరని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మంగళవారం ప్రకటించారు. 2.3 కోట్ల జనాభా గల తైవాన్ లోపలి, వెలుపలి స్వాతంత్య్ర అనుకూల శక్తులకు చైనా అధ్యక్షుడు తన నూతన సంవత్సర సందేశంలో గట్టి హెచ్చరికలు జారీచేశారు. చైనా గత సంవత్సరం దాదాపు ప్రతిరోజు తన యుద్ధనౌకలను, విమానాలను తైవాన్ సమీపంలోకి పంపి సైనిక ఒత్తిడిని పెంచినట్టు వార్తలు వెలువడ్డాయి.
ఈ చర్యలు తైవాన్‌లో తన సైనిక ఉనికిని సుస్థిరం చేసుకోవడానికి చైనా చేస్తున్న కుటిల ప్రయత్నంగా తైవాన్ ప్రభుత్వం ఇదివరకు ఆరోపించింది. ప్రజాస్వామిక పాలన గల తైవాన్ ద్వీపాన్ని తన సొంత భూభాగంగా చైనా పరిగణిస్తున్నది. అయితే ఈ వాదనలను తైవాన్ బలంగా తోసిపుచ్చుతున్నది. తైవాన్ ప్రజలు మాత్రమే తమ భవిష్యత్తును నిర్ణయించుకుంటారని, ఆ నిర్ణయాన్ని చైనా గౌరవించాల్సి ఉంటుందని తైవాన్ ప్రభుత్వం ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

