Omicron BA.4.6 | మరో వేవ్ తప్పదా? విస్తరిస్తున్న ఒమిక్రాన్ బీఏ.4.6 వేరియంట్!
Omicron BA.4.6 | కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. దీంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. కొత్త వేరియంట్ వస్తే తప్ప.. ఇప్పటికీ ఎలాంటి ముప్పు లేదని నిపుణులు పేర్కొన్న విషయం విధితమే. తాజాగా కొత్త వేరియంట్ విస్తరిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో
Omicron B.A.4.6 | కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. దీంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. కొత్త వేరియంట్ వస్తే తప్ప.. ఇప్పటికీ ఎలాంటి ముప్పు లేదని నిపుణులు పేర్కొన్న విషయం విధితమే. తాజాగా కొత్త వేరియంట్ విస్తరిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో మరో వేవ్ తప్పదా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీ.ఏ.4.6 ప్రభావం చూపుతుండగా.. యూకేలో కూడా విస్తరిస్తున్నట్లు గుర్తించారు.
యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం.. ఆగస్టు 14 నుంచి వారంలో బీ.ఏ.4.6 వేరియంట్ యూకేలోని నమూనాల్లో కనీసం 3.3శాతం గుర్తించారు. ఆ తర్వాత 9శాతానికి చేరింది. అమెరికాలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం.. 9శాతం కేసులకు కొత్త వేరియంట్ కారణంగా గుర్తించారు. ఆయా దేశాలతో పాటు మరికొన్ని దేశాల్లోనూ ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వేరియంట్ ఒమిక్రాన్ బీఏ.4 సబ్‌వేరియంట్‌కు చెందింది.
ఈ వేరియంట్ ఎంత ప్రమాదమంటే..?.. వ్యాక్సిన్‌తో రక్షణ ఉంటుందా?
శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. బీఏజ4.6 ఒమిక్రాన్ బీఏ.4 వేరియంట్‌కు చెందిన సబ్ వేరియంట్. దీన్ని ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఆ తర్వాత బీఏ.5 వేరియంట్‌తో పాటు బీఏ.4.6 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అయితే, ఇది రీకాంబినెంట్ వేరియంట్ అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రెండు రకాల సార్స్-కోవ్-2 ఒకే వ్యక్తికి.. ఒకే సమయంలో సోకుతుంది. అయితే, గతంలో గుర్తించిన వేరియంట్ల కంటే. ఈ వేరియంట్ ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగిస్తుందా? లేదా? స్పష్టంగా తెలియనప్పటికీ.. ఇతర ఒమిక్రాన్ వేరియంట్ల మాదిరిగానే ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
అయితే, టీకాలు తీసుకున్నా తప్పించుకునే ప్రమాదం ఉందని అధ్యయనంలో గుర్తించారు. బూస్టర్ డోసులు తీసుకుంటున్నందున బీఏ.4.6కు వ్యతిరేకంగా టీకాలు ప్రభావవంతంగానే ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్లతో వేగంగా ఇన్ఫెక్షన్ పెరుగుతున్నా.. అయితే స్వల్ప అనారోగ్యం ఉంటుందని, తక్కుగానే మరణాలకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కేసులు తగ్గుముఖం పడుతున్నా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల హెచ్చరించింది. అందరు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

