ఒమిక్రాన్‌పై మోనోక్లోనల్ యాంటీబాడీ.. కాక్టెయిల్ ట్రీట్మెంట్ పనిచేయదు!

హైదరాబాద్: B.1.1.529 (ఒమిక్రాన్) కరోనా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా కలవరం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేరియంట్ డెల్టా కన్నా ఆరు రెట్లు ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో సెకండ్ వేవ్ సమయంలో డెల్టా వేరియంట్ పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్లో ఉన్న విపరీత మ్యుటేషన్లను నిర్వీర్యం చేయడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ కానీ కాక్టెయిల్ ట్రీట్మెంట్ కూడా ఒమిక్రాన్ వేరియంట్‌ను నిర్వీర్యం చేయదని ఫార్మా నిపుణులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ప్రిలిమినరీ విశ్లేషణ ద్వారా వాళ్లు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ కరోనా ఆర్ వాల్యూ ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రోగనిరోధక వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. వ్యాక్సిన్లు కూడా పనిచేయకపోవచ్చు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
తీవ్ర నష్టాన్ని మిగిల్చిన డెల్టా వేరియంట్.. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీకి స్పందించింది. అయితే డెల్టా నుంచి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ మాత్రం మోనోక్లోనల్ థెరపీకి స్పందించలేదు. నిజానికి మోనోక్లోనల్ చికిత్స ఓ అద్భుతమని మొదట్లో అనుకున్నారు. కానీ డెల్టా ప్లస్‌పై ఆ చికిత్స పనిచేయకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇక ఒమిక్రాన్‌పై ఆ యాంటీబాడీ చికిత్స పనిచేయకపోవచ్చు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒమిక్రాన్‌లో ఉన్న G339D, S373P, G496S, Q498R, Y505H స్పైక్ ప్రోటీన్లు మోనోక్లోనల్ యాంటీబాడీలను తట్టుకోగలవని ఐజీఐబీలో పనిచేస్తున్న రీసర్చ్ స్కాలర్ మెర్సీ రోఫినా తెలిపారు. ఎటిసివిమాబ్, బామ్లనివిమాబ్, కసిరివిమాబ్, ఇండివిమాబ్తో పాటు వాటి కాక్టెయిల్స్ను కూడా ఒమిక్రాన్ తట్టుకుంటుందని రోఫినా తెలిపారు. నిజానికి ఒమిక్రాన్ వల్ల వ్యాధి తీవ్రత ఎంత ఉంటుందో ఇంకా స్పష్టం కాలేదు. కానీ వైరస్ ప్రబలుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు B.1.1.529 వేరియంట్‌కు విస్తృతంగా జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

