Omicron | 57 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్.. యూరప్‌లో దిగజారుతున్న పరిస్థితి
Omicron variant spread in 57 countries, | మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలకు వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటి వరకు 57 దేశాల్లో కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. జింబాబ్వే సహా దక్షిణాఫ్రికా

బ్రిటన్ : మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలకు వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటి వరకు 57 దేశాల్లో కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. జింబాబ్వే సహా దక్షిణాఫ్రికా దేశాల్లో కేసులు, ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య పెరుగుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. మరో వైపు యూరప్‌లో దారుణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని స్థానిక ఆరోగ్య సంస్థ పేర్కొంది. కరోనా కారణంగా మరణాలు, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య నిరంతరం పెరుగుతున్నదంటూ యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ECDC) ఆందోళన వ్యక్తం చేసింది.
ఆంక్షల బాటలో యూరోపియన్ దేశాలు
ఐరోపాలో కొత్త వేరియంట్ వ్యాప్తిగా వేగంగా సాగుతున్నది. ఈ క్రమంలో యూరోపియన్ యూనియన్ దేశాలు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మళ్లీ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. రెస్టారెంట్లు, బార్లలో టీకాలు తీసుకోని వ్యక్తులను నిషేధించడంతో పనిచేసే చోట్ల పని గంటలు తగ్గింపు తదితర చర్యలు తీసుకుంటున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతోందని ఈసీడీసీ డైరెక్టర్ ఆండ్రియా అమ్మోన్ తెలిపారు. మరో వైపు కరోనా కొత్త వేరియంట్ తీవ్రతను అంచనా వేసేందుకు ప్రస్తుతం ఉన్న డేటా సరిపోదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అయితే, డెల్టా వేరియంట్ కంటే తీవ్రమైన ప్రభావం చూపడం లేదని తెలిపింది. డబ్ల్యూహెచ్‌కు చెందిన ఎమర్జెన్సీ మెడిసిన్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ మాట్లాడుతూ.. వేరియంట్ వేగంగా విస్తరించిన.. తీవ్రత తక్కువగానే ఉన్నదని ప్రాథమిక డేటా చూపుతుందన్నారు. ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.
దక్షిణాఫ్రికాలో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య డబుల్
కొవిడ్ -19 కారణంగా ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య ముందు రోజుతో పోలిస్తే రెండింతలు పెరిగింది. ఒమిక్రాన్ తొలి కేసు దక్షిణాఫ్రికాలో నమోదైన విషయం తెలిసిందే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD) ప్రకారం.. గత 24 గంటల్లో 383 మంది ఆసుపత్రిలో చేరారు. అంతకు ముందు రోజు 175 ఆసుపత్రుల్లో చేరారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. కొత్తగా నమోదైన 13,147 కొత్త కేసుల్లో 64 శాతం గౌటెంగ్ ప్రావిన్స్‌లో ఉన్నాయి. ఈ ప్రావిన్స్‌లో జోహన్నెస్‌బర్గ్, ప్రిటోరియా ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

