Bangladesh | దాడుల భయం.. బంగ్లాదేశ్‌ను వీడిన 9మంది ఎన్టీపీసీ ఇంజినీర్లు
Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అనేక చోట్ల హిందువులపై దాడులు చేస్తూ చంపేస్తున్నారు. వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. దీంతో అక్కడి హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది.
Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అనేక చోట్ల హిందువులపై దాడులు చేస్తూ చంపేస్తున్నారు. వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. దీంతో అక్కడి హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో పని చేస్తున్న భారతీయులు చాలా మంది ఇండియాకు తిరిగొచ్చేస్తున్నారు. ప్రైవేటు రంగంలోనే కాకుండా.. భారత రాయబార కార్యాలయంతోపాటు వివిధ రంగాల్లో పని చేస్తున్న కేంద్ర సంస్థల ఉద్యోగులు కూడా బంగ్లాను వీడుతున్నారు.
తాజాగా 9 మంది ఎన్టీపీసీ ఇంజినీర్లు బంగ్లాదేశ్‌ను వదిలి ఇండియా వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర విద్యుత్ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీకి చెందిన ఉద్యోగులు కొందరు బంగ్లాదేశ్‌లో డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. ఇండియా-బంగ్లా మధ్య ఉన్న మైత్రి ప్రకారం బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్షిప్ పవర్ కంపెనీ నిర్వహిస్తున్న రాంపాల్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో పని చేస్తున్నారు. అయితే, అక్కడ నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో తొమ్మిది మంది భారతీయ ఉద్యోగులు ఆ దేశాన్ని వీడి, శనివారం ఇండియా వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి వారు అక్కడి అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని సమాచారం. అలాగే నోటీసులు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. అక్కడి ఉద్యోగులను తనిఖీ చేయగా.. వారు విధులకు రాలేదని తెలియడంతో విచారించారు.
వారు ఇండియా వెళ్లిపోయారని తెలిసింది. భోమ్రా మార్గం ద్వారా వారు ఇండియా వచ్చినట్లు గుర్తించారు. బంగ్లాలో ఉన్న భారత ఉద్యోగులకు ఇండియన్ ఎంబసీ ఇప్పటికే ఒక సూచన చేసింది. కుటుంబంతో కలిసి అక్కడ ఉండటం క్షేమం కాదని, కుటుంబాల్ని ఇండియాకు పంపించాలని సూచించింది. దీంతో రాయబార కార్యాలయంతోపాటు పలువురు ఉద్యోగులు తమ ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇండియాకు పంపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- awami league
- bangladesh
- Hindus
- NTPC
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

