North Korea | అమెరికాకు హెచ్చరిక.. మరో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా
అమెరికా, దక్షిణ కొరియాకు (South Korea) పక్కలో బళ్లెంలా ఉత్తర కొరియా తయారైంది. వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ ఇరు దేశాలకు గట్టి హెచ్చరికలు జారీచేస్తున్నది. అమెరికాతో (America) కలిసి దక్షిణ కొరియా పెద్దఎత్తున సైనిక డ్రిల్స్ నిర్వహిస్తుండటంతో.. తామూ తగ్గేది లేదని కిమ్ కింగ్డమ్ స్పష్టం చేస్తున్నది.
సియోల్: అమెరికా, దక్షిణ కొరియాకు (South Korea) పక్కలో బళ్లెంలా ఉత్తర కొరియా తయారైంది. వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ ఇరు దేశాలకు గట్టి హెచ్చరికలు జారీచేస్తున్నది. అమెరికాతో (America) కలిసి దక్షిణ కొరియా పెద్దఎత్తున సైనిక డ్రిల్స్ నిర్వహిస్తుండటంతో.. తామూ తగ్గేది లేదని కిమ్ కింగ్డమ్ స్పష్టం చేస్తున్నది. సోమవారం ఉదయం తూర్పు తీరంలోని సముద్ర జలాలవైపు (East Sea) రెండు బాలిస్టిక్ క్షిపణులను (Ballistic missiles) ఉత్తర కొరియా (North Korea) ప్రయోగించింది. ఉదయం 7.47 గంటల ప్రాంతంలో ఉత్తర వాంఘే ప్రావిన్స్‌లో ఉన్న జుంగ్వాలో రెండు స్వల్ప శ్రేణి (Short-range) బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడాన్ని తామ సైన్యం గుర్తించిందని దక్షిణ కొరియా జాయింట్ ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (JCS) వెల్లడించారు. అవి తూర్పు తీరంలోని సముద్ర జలాలవైపు పయణించాయని తెలిపారు. వాటిని జపాన్ సముద్రంగా (Sea of Japan) కూడా పిలుస్తారన్నారు.

దీంతో ఈ నెలలో ఉత్తరకొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల సంఖ్య ఏడుకు చేరింది. గతేడాది 70 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించడం విశేషం. దక్షిణ కొరియాతో కలిసి అమెరికా సైనిక కసరత్తులు చేసిన నేపథ్యంలో వరుసగా క్షిపణులను ప్రయోగిస్తూ వస్తున్నది. ఇరుదేశాలు నిర్వహిస్తున్న సైనిక కసరత్తులను తమ దేశంపై దండయాత్రకు రిహార్సల్స్ అని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

