Nokia Layoffs | హెల్సింకి: ప్రముఖ టెలికం కంపెనీ నోకియా ఉద్యోగులను తొలగించే పనిలో పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో 16 శాతం లేదా 14 వేల మంది ఉద్యోగులను తొలగించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు గురువారం సంస్థ సీఈవో పెక్కా లండ్మార్క్ ప్రకటించారు.
ఈ ఏడాది మూడో త్రైమాసికంలో సంస్థ అమ్మకాలు, లాభాలు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఖర్చు తగ్గించుకుంటూ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను కుదించాలని భావిస్తున్నట్టు సంస్థ పేర్కొంది. దీని ప్రకారం 2026 నాటికి ప్రస్తుతమున్న 86 వేల మంది ఉద్యోగులను 72వేలకు తగ్గిస్తామని ఆయన చెప్పారు. మరోవైపు గూగుల్ కూడా తమ న్యూస్ విభాగంలో 50 మంది ఉద్యోగులను తొలగించనున్నది.