బార్ వద్ద కాల్పుల కలకలం : 9 మందికి గాయాలు
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఓ బార్ వెలుపల దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి.
న్యూయార్క్ : అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఓ బార్ వెలుపల దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు షూటర్లు కాల్పులకు తెగబడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్లాక్ కారులో నుంచి దుండగులు నడిరోడ్డుపై వెళుతున్న జనంపై కాల్పులు జరిపారని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం.
దుండగులు 40 రౌండ్లు కాల్పులు జరిపారని ఓ వార్తా ఛానెల్ వెల్లడించింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఏడుగురి పరిస్ధితి నిలకడగా ఉండగా ఇద్దరి ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

