యూకేలో వెలుగులోకి లాంబ్డా వేరియంట్..!
Lambda Variant in UK: యూకేలో బయటపడ్డ కొవిడ్ కేసుల్లో 42 శాతం డెల్టా ప్లస్ వేరియంట్ కేసులున్నాయి.

లండన్: ఓ వైపు డెల్టా, డెల్లా ప్లస్ వేరియంట్లు ప్రపంచ దేశాలను వణికిస్తుండగానే.. తాజాగా ‘లంబ్డా’ అనే కొత్త వేరియంట్‌ను యూకేలో గుర్తించారు. పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ ఈ విషయాన్ని (పీహెచ్ఈ) వెల్లడించింది. గత వారం యూకేలో బయటపడ్డ కొవిడ్ కేసుల్లో 42 శాతం డెల్టా ప్లస్ వేరియంట్ కేసులున్నాయి. తాజాగా ‘లంబ్డా’ వేరియంట్‌కు చెందిన 6 కేసులను కనుగొన్నట్టు పీహెచ్ఈ పేర్కొన్నది.
కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో దాని ప్రభావంపై ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నదని పీహెచ్ఈ తెలిపింది. అయితే, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి తాజా వేరియంట్‌తో ముప్పేమి ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. దీనిపై ఇతమిద్దంగా ఒక అభిప్రాయానికి రావడానికి ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని, లంబ్డా వేరియంట్‌తో మరింత ఎక్కువ ప్రమాదం ఉందా, లేదా అనే విషయంలో ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.
గ్రీక్ ఆల్ఫబెట్ లెటర్స్ ఆధారంగా కొత్త వేరియంట్లకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్లు పెడుతుంది. లంబ్డా వేరియంట్‌ను తొలుత 2020 ఆగస్టులో పెరూలో గుర్తించామని, అప్పటి నుంచి ప్రంపంచవ్యాప్తంగా 29 దేశాల్లో కనిపించిందని వెల్లడించింది. అర్జెంటీనా, చిలీ సహా పలు లాటిన్ అమెరికా దేశాల్లో లాంబ్డా వేరియంట్ కనిపించినట్లు డబ్ల్యూహెచ్ఓ వీక్లీ బులెటిన్ తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్ వరకు పెరూలో నమోదైన కరోనా కేసుల్లో 81 శాతం లంబ్డా వేరియంట్ కేసులున్నాయని, చిలీలో గత 60 రోజుల్లో నమోదైన కేసుల్లో 32 లంబ్డా వేరియంట్ కేసులు కనిపించాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

