శృంగారానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆస్ట్రేలియా పార్లమెంట్

క్యాన్బెరా: ఆస్ట్రేలియా పార్లమెంట్ శృంగార చేష్టలకు అడ్డాగా మారింది. రాజకీయాలకు నిలయమైన పార్లమెంట్లో విచ్చలవిడిగా శృంగార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆఫీసుల్లోనే పార్లమెంట్ సిబ్బంది శృంగారంలో తేలిపోతున్న కొన్ని వీడియోలు ఇప్పుడు ఆస్ట్రేలియా మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెక్స్ వీడియోలు లీకైన ఘటనలో తాజాగా ఓ ఉద్యోగిని తొలగించారు. మహిళా ఎంపీ డెస్క్ వద్ద .. శృంగారం చేస్తున్న ఓ వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వీడియోలు దేశ ప్రతిష్టకు అవమానకరమని ప్రధాని స్కాట్ మారిసన్ అన్నారు. రక్షణ కార్యాలయంలో పనిచేస్తున్న మాజీ ఉద్యోగిని తనపై లైంగిక దాడి జరిగినట్లు ఇటీవలే ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ కేసులో రక్షణ మంత్రి క్షమాపణలు కూడా చెప్పారు.
ప్రేయర్ రూమే..
ఆస్ట్రేలియా రాజకీయాలు విషపూరితంగా మారాయన్న ఆరోపణలు వస్తున్నాయి. పార్లమెంట్ ఉద్యోగి ఒకరు ఆస్ట్రేలియా మీడియాకు కొత్త శృంగార వీడియోలను రిలీజ్ చేశారు. రెండేళ్ల క్రితం ఆ వీడియోలను తీసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో ఉన్న ప్రేయర్ రూమ్‌ను శృంగార వాంఛలు తీర్చుకునేందుకు వాడుతున్నారు. పార్లమెంట్‌కు సెక్స్ వర్కర్లను కూడా తీసుకువచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. పార్లమెంట్లో ఎవరైనా ఏమైనా చేయవచ్చు అన్న ఉద్దేశంతో కొంత మంది సిబ్బంది వ్యవహరిస్తున్నారని వీడియోలు బయటపెట్టిన వ్యక్తి తెలిపారు. ఉద్యోగులు చాలా వరకు నైతికంగా దివాళా తీసినట్లు టామ్ అనే వ్యక్తి ఆరోపించాడు.
కొత్త సెక్స్ వీడియోలపై ప్రధాని స్కాట్ మారిసన్ పార్లమెంట్లో మాట్లాడారు. ఆ వీడియోలు తనను షాక్‌కు గురిచేసినట్లు ఆయన తెలిపారు. సభను మళ్లీ ఆర్డర్‌లోకి తీసుకురావాలని, రాజకీయాలను పక్కనపెట్టి, సమస్యను గుర్తించాలన్నారు. కొత్త వీడియోలు లీక్ కావడంతో.. ఆస్ట్రేలియా ప్రధానిపై విమర్శలు మరింత పదునెక్కాయి. స్కాట్ ప్రభుత్వాన్ని ఖండిస్తున్న నిరసనకారులు భారీ ప్రదర్శనలు చేపట్టారు. రాజధాని క్యాన్బెరాలో వేల సంఖ్యలో ఆందోళనకారులు ర్యాలీ తీశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

