Lungs Cancer | లండన్, మార్చి 22: ప్రతియేటా లక్షలాది మందిని బలితీసుకుంటున్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు విరుగుడు కనిపెట్టే ప నిలో బ్రిటన్ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆక్స్ఫ ర్డ్ యూనివర్సిటీ, ఫ్రాన్సిప్ క్రిక్ ఇన్స్టిట్యూ ట్, యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెంది న శాస్త్రవేత్తలు కలిసి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చే స్తున్నారు.
‘లంగ్వ్యాక్స్’గా దీనికి పేరు పెట్టారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఊపిరితిత్తుల క్యా న్సర్ వ్యాక్సిన్. ఊపిరితిత్తుల క్యాన్సర్ క ణాలను గుర్తించి, తొలగించేలా ఈ వ్యాక్సి న్ పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొదట మూడు వేల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలని భా విస్తున్నారు. త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నారు.