మారుస్తానన్న ఇమ్రాన్ కూడా మార్చలేకపోయారు.. పాక్ చరిత్రే అంత..
పాకిస్తాన్ రాజకీయ చిత్ర పటంతో పరిచయం ఉన్నవారెవ్వరూ ఉలిక్కి పడలేదు. చరిత్ర పునరావృత్తం అయిందని మాత్రం మరోమారు గుర్తు చేసుకున్నారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ప్రధాని ఇమ్రాన్ అధ్యక్షుడికి సిఫార్సు చేశారు. ప్రధాని సిఫార్సు చేయడమే ఆలస్యం… కేవలం 30 నిమిషాల్లోనే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ అధ్యక్షుడు ప్రకటన చేశారు. 90 రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించాలని కూడా ఆదేశించారు. ఇక.. పూర్తి కాలపు పదవిలో కొనసాగని ప్రధానుల జాబితాలో ఇమ్రాన్ కూడా చేరిపోయారు. పాక్ చరిత్రే అంత. ఎవ్వరు కూడా పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు.
పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడినప్పటి నుంచి.. అక్కడి ప్రజలు సుస్థిరమైన పాలనే చూసి ఎరగరు. కావాలంటే సుస్థిరమైన ఆర్మీ పాలనను చూసి వుంటారేమో గానీ… సుస్థిరమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాల రుచి మాత్రం వారికి తెలియదంటే అతిశయోక్తి కాదేమో. 2000 సంవత్సరం నుంచి గనక మనం పాక్ చరిత్రను కాస్త అధ్యయనం చేస్తే చాలు.. కథ మొత్తం అర్థమైపోతుంది. 2000 నుంచి పాలించే నేతలు ఒక్క సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు మాత్రమే పాలించారు. ఆ తర్వాత గద్దె దిగిపోయారు. గత దశాబ్ద కాలంలోనే ఆరుగురు ప్రధానులు రావడం.. వెళ్లడం… ప్రజలు చూశారు. ఇలాంటి చరిత్రకు తెర వేస్తామని, కొత్త పాకిస్తాన్‌ను చూపిస్తామని ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ అధికారంలోకి వచ్చారు. కానీ.. కాలక్రమేణ ఇమ్రాన్ అదే చరిత్ర పుటల్లో పేరు సంపాదించారు గానీ… సరికొత్త పాక్‌ను మాత్రం అందించలేకపోయారు.

పాక్ ప్రధానుల పదవీ కాలంపై ఓ లుక్ వేయండి..
1. షాహీద్ ఖక్కాన్ అబ్బాసీ.. 2017 ఆగస్టు నుంచి 2018 వరకూ పాక్ ప్రధాని
2. నవాజ్ షరీఫ్.. 2013 నుంచి 2017 వరకూ ప్రధాని.. ప్రధానిగా కొనసాగడానికి అనర్హుడని సుప్రీం తేల్చేయడంతో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
3. మీర్ హజార్ ఖాన్ ఖోసో… 2013 మార్చి 25 నుంచి జూన్ 5 వరకూ ఆపద్ధర్మ ప్రధానిగా
4. రాజా పర్వేజ్ అష్రఫ్.. పాక్ 19 వ ప్రధాని. 2012 జూన్ 22 న బాధ్యతలు స్వీకరించారు. 2013 మార్చి 16 వరకూ ఉన్నారు.
5. సయ్యద్ యూసుఫ్ గిలానీ.. 2008 మార్చి 25 న బాధ్యతలు చేపట్టారు. 2012 ఏప్రిల్ 26 న పదవీ విరమణ
6. షౌకత్ అజీజ్.. ఈయన 17 వ ప్రధాని. 2004 ఆగస్టు 20న బాధ్యతలు చేపడితే.. 2007 నవంబర్ 15 వరకే ఉన్నారు.
7. చౌదరీ సుజాత్ హుస్సేన్.. 16 వ ప్రధాని. 2004 జూన్ 30న బాధ్యతలు చేపడితే.. 2004 ఆగస్టున రాజీనామా
8. జఫరుల్లా ఖాన్ జమాలీ.. 2002 నుంచి 2004 వరకూ ఉన్నారు.
9. జనరల్ పర్వేజ్ ముషార్రఫ్.. 1999 నుంచి 2002 వరకూ ఉన్నారు.
10. నవాజ్ షరీఫ్.. 1997 నుంచి 1999 వరకూ ఉన్నారు. అప్పట్లో ఆర్మీ చీఫ్ ముషార్రఫ్ ఈయన చేతుల్లోంచి అధికారాన్ని తీసేసుకున్నారు. దీని తర్వాత దేశం విడిచి వెళ్లిపోయారు.
11. మలిక్ మిరాజ్ ఖాలీద్… 1996 నవంబర్ నుంచి 1997 ఫిబ్రవరి వరకూ ప్రధానిగా..
12. బెనజీర్ భుట్టో… రెండు సార్లు ప్రధాని అయ్యారు. కానీ… రెండు సార్లూ పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. 1988 నుంచి 1990 వరకూ మొదటి సారి.. 1993 నుంచి 1996 వరకూ రెండోసారి ఉన్నారు.
13. జుల్ఫీకర్ అలీ భుట్టో… తొమ్మిదో ప్రధాని, 1973 నుంచి 1977 వరకూ వున్నారు.
14. లియాఖత్ అలీ ఖాన్.. మొదటి ప్రధాని.. 1947 నుంచి 1951 వరకూ మాత్రమే ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

