పుతిన్ అసలు రష్యా పౌరుడే కాదు.. ప్రతిపక్ష నేత సంచలన ఆరోపణ
రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఆ దేశ ప్రతిపక్ష నేత ఎలెక్సీ నెవెలనీ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పుతిన్ అసలు రష్యా పౌరుడే కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తూ తాను ఎంత మాత్రం మౌనంగా ఉండలేనని అన్నారు. గత చరిత్రను పట్టుకు వేలాడుతూ.. ఉక్రెయిన్ ప్రజలను చంపుతున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. భయభ్రాంతులున్న ప్రజలుగా మనం మన జీవితాలను కొనసాగించకూడదని ఆయన కోరారు. తాను కూడా సోవియట్ యూనియన్ నుంచి వచ్చినవాడినేనని, శాంతి, సామరస్యం కోసం అందరూ పాటుపడాలని ఎలెక్సీ పిలుపునిచ్చారు.
రష్యాలోని ప్రధాన కూడళ్లలోనే కాకుండా, ప్రపంచం ఏ మూలకు వెళ్లినా… యుద్ధాన్ని వ్యతిరేకిస్తూనే వుండాలని ఆయన రష్యా ప్రజలకు సూచించారు. ఒకవేళ రష్యన్ ప్రజలు ఎవరైనా విదేశాల్లో వుంటే.. అక్కడి రష్యా రాయబార కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలందరూ తమ భయాన్ని వీడి, యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని ఆయన సూచించారు. యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడడమే కాదని, యుద్ధానికి వ్యతిరేకంగా ఓ ఉద్యమమే చేయాలని రష్యా ప్రతిపక్ష నేత ఎలెక్సీ నెవెలనీ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

