Nepal | నేపాల్ (Nepal)లో పరిస్థితి చేయిదాటిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ యువత చేపట్టిన ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. సోషల్ మీడియాపై విధించిన బ్యాన్‌ను ఎత్తివేసినప్పటికీ నిరసనలు ఆగడం లేదు. వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని కేపీ ఓలి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని కాఠ్మాండూ (Kathmandu)లోని పార్లమెంట్ వద్ద రోడ్లను దిగ్బంధించారు. పలువురు మంత్రులు, రాజకీయ నేతల ఇళ్లను ముట్టడిస్తున్నారు. మరోవైపు రాజధానిలోని ప్రధాని ఓలి (Nepal PM KP Oli) అధికారిక నివాసాన్ని నిరసనకారులు ముట్టడించారు. ఇంట్లోకి చొరబడి ధ్వంసం చేశారు. అంతేకాదు ఆ ఇంటికి నిప్పుపెట్టారు (house set ablaze).
🔥 Breaking: Protesters set fire to PM KP Oli’s residence in Balkot amid escalating unrest. 😲🚨#NepalProtests #BreakingNepal #KPOli #Balkot #NepalCrisis #YouthMovement #NepalNews pic.twitter.com/hnVlx27Us8
— TikTube X News (@TikTubeXNews) September 9, 2025
మరోవైపు సీనియర్ రాజకీయ నేతల ఇళ్లు, కార్యాలయాలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. నేపాల్ అధ్యక్షుడు (Nepal Presidents) రామ్ చంద్ర పౌడెల్ అధికారిక నివాసంతోపాటూ నేపాల్ మాజీ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ, యూఎమ్ఎల్ నాయకుడు మహేష్ బాస్నేట్, నేపాలీ కాంగ్రెస్ నేత గగన్థాపా, మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్, నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ డ్యూబా, మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్, కాఠ్మాండులోని నేపాలీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంపై నిరసనకారులు దాడి చేసి నిప్పు పెట్టారు. యూఎమ్ఎల్ పార్టీ ఆఫీసు సైతం మంటల్లో కాలిపోతోంది. మరోవైపు ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని ఓలి ఆల్ పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చారు.
Inside president private residence pic.twitter.com/ZydBNDkMOO
— Out of Context Nepal🇳🇵 (@NoContextNepol) September 9, 2025
Balkhu is heating.#KPOliResign #kpoliisterrorist pic.twitter.com/QLJLI0p7wY
— Saveen Shrestha (@_savage_ing) September 9, 2025
#KPOliResign #kpoliisterriorist #NepalProtests pic.twitter.com/WzqJHcRKPX
— Saveen Shrestha (@_savage_ing) September 9, 2025
Also Read..
నేపాల్ రణరంగం.. సోషల్ మీడియా నిషేధంపై భగ్గుమన్న ‘జనరేషన్ జెడ్’
Social Media Ban | వెనక్కి తగ్గిన నేపాల్ సర్కార్.. సోషల్ మీడియా నిషేధం ఎత్తివేత
Nepal | నేపాల్‌లో రాజకీయ సంక్షోభం..? మంత్రుల రాజీనామా.. దుబాయ్‌కి ప్రధాని ఓలి..!