Russia vs Ukraine : రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine war) దేశాల మధ్య నాలుగేళ్లుగా యుద్దం కొనసాగుతూనే ఉన్నది. ఆ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంచలన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ యుద్ధంతో రష్యాకు సైనికపరంగా భారీ నష్టం వాటిల్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ యుద్దంలో ఇప్పటివరకు 5 లక్షల మంది రష్యా సైనికులు (Russia Soldiers) ప్రాణాలు కోల్పోయారని బ్రిటన్ (Britain) నిఘా వర్గాలు అంచనావేశాయి.
ఇదిలావుంటే యుద్ధం మొదలైన దగ్గరి నుంచి తాము 55 వేల మంది సైనికులను కోల్పోయామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఏడాది ఫిబ్రవరిలో వెల్లడించారు. కానీ ఇరువైపులా ప్రాణనష్టం భారీగానే ఉన్నప్పటికీ రెండు దేశాలు వాస్తవ లెక్కలను వెల్లడించట్లేదనే ఆరోపణలున్నాయి. గత నాలుగేళ్లుగా డాన్బాస్ ప్రాంతంలోని ఉక్రెయిన్ స్థావరాలపై దాడుల కోసం రష్యా తన సైనికులను దశల వారీగా మోహరించింది. కొత్తగా చేరిన సైనికులు, జైళ్ల నుంచి నియమించుకున్నవారు ఈ ఘర్షణల్లో పాల్గొన్నారు. వారికి సరైన శిక్షణ లేకపోవడం కూడా యుద్ధరంగంలో భారీ ప్రాణనష్టానికి దారితీసినట్లు తెలుస్తోంది.