Maryam Nawaz To Imran | పూర్తి మద్దతు తెచ్చుకో చూస్తా.. ఇమ్రాన్‌కు నవాజ్ కూతురు చాలెంజ్
Maryam Nawaz To Imran | అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నాడు 172 మంది మద్దతు తెచ్చుకోవాలని ఇమ్రాన్‌ను మార్యం నవాజ్ సవాల్ చేశారు.
Maryam Nawaz To Imran | పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మార్యం నవాజ్ చాలెంజ్ విసిరారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటింగ్ వేళ మీకు అవసరమైన 172 మంది ఎంపీల మద్దతు సంపాదించుకోగలరా? అని సవాల్ చేశారు. ఇమ్రాన్‌ఖాన్‌ను సాగ నంపేందుకు పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), జామియత్ ఉలేమా ఈ-ఇస్లామ్ ఫాజిల్ తదితర పార్టీలతో కూడిన పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం) ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సభ జరిగింది.
ఈ సభలో మార్యం నవాజ్ మాట్లాడుతూ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన పదవి కాపాడుకునేందుకు తనకు అత్యంత విశ్వసనీయుడైన పంజాబ్ సీఎం ఉస్మాన్ బుజ్దర్పైనే నమ్మకం పెట్టుకున్నారని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై నెగ్గిన తర్వాత ప్రధానిగా చౌదరి పర్వేజ్ ఇలాహిని నియమించేందుకు సిద్ధమయ్యారని అన్నారు. తద్వారా తన మిత్ర పక్షం పాకిస్థాన్ ముస్లింలీగ్ క్వాయిడ్ పార్టీ మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కాపాడుకునేందుకు మతం కార్డును కూడా వాడుతారని మార్యం నవాజ్ మండి పడ్డారు. ఇమ్రాన్‌ఖాన్ ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారని అన్నారు. ఇటీవల జరిగిన 16 ఉప ఎన్నికల్లో 15 సార్లు అధికార పార్టీ ఓడిపోవడమే దీనికి నిదర్శనం అని స్పష్టం చేశారు. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై నెగ్గాలంటే ఇమ్రాన్‌ఖాన్‌కు 172 మంది సభ్యుల మద్దతు కావాలి. ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఈ-ఇన్సాఫ్‌కు 155 మంది మాత్రమే ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

