చంద్రుడిపైకి ఆర్టెమిస్-1.. మరికొన్ని గంటల్లో నాసా ప్రయోగం
ఫ్లోరిడా: ఆర్టెమిస్-1 ప్రాజెక్టులో భాగంగా ఇవాళ అమెరికా స్పేస్ సెంటర్ నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్(ఎస్ఎల్ఎస్) రాకెట్‌ను ప్రయోగిస్తోంది. దీనితో పాటు ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా నాసా నింగిలోకి పంపనున్నది. ఫ్లోరిడాలోని ఆధునీకరించిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని పరీక్షించనున్నారు. చంద్రుడిపైకి మానవులను పంపించాలన్న ఉద్దేశంతో ఆర్టెమిస్ ప్రాజెక్టును చేపట్టారు. అయితే ఆర్టెమిస్-1 ప్రధాన టార్గెట్ ఓరియన్ సిస్టమ్‌ను పరీక్షించడమే. అంతరిక్ష వాతావరణంలో ఎలా ఓరియన్ క్యాప్సూల్స్ పనిచేస్తోందో నాసా టెస్ట్ చేయనున్నది. వ్యోమగాములను మోసుకువెళ్లే ఓరియన్ క్యాప్సూల్ ఎలా రీ ఎంట్రీ ఇస్తుంది, కిందకు ఎలా దిగుతుంది, రికవరీ ఎలా ఉంటుందో నాసా టెస్ట్ చేయనున్నది.
ఎస్ఎల్ఎస్ అత్యంత శక్తివంతమైన రాకెట్ అని నాసా చెబుతోంది. ఓరియన్ క్యాప్సూల్‌ను భూమికి దూరంగా తీసుకెళ్లడమే ఈ రాకెట్ ఉద్దేశం. అయితే చంద్రుడి చుట్టూ ఈ స్పేస్‌క్రాఫ్ట్ చక్కర్లు కొట్టనున్నది. ఆరు వారాల తర్వాత పసిఫిక్ సముద్రంలో ఓరియన్ క్యాప్సూల్ దిగుతుంది. ఆర్టెమిస్-1 ప్రాజెక్టులో వ్యోమగాములు ఎవరూ ఉండరు. 2024 తర్వాత చేపట్టే ఆర్టెమిస్ ప్రాజెక్టుల్లో ఆస్ట్రోనాట్స్ ఉంటారు. వాతావరణం అనుకూలిస్తే స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8.33 నిమిషాలకు ఎస్ఎల్ఎస్ రాకెట్ నింగికి ఎగురుతుంది. ఒకవేళ వర్షం కురిస్తే ఆ ప్లాన్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
మిషన్ వాస్తవాలు..
లాంచింగ్ డేట్: ఆగస్టు 29, 2022
మిషన్ కాలపరిమితి: 42 రోజులు, 3 గంటల, 20 నిమిషాలు
మొత్తం ప్రయాణ దూరం: 1.3 మిలియన్ మైళ్లు
రీ ఎంట్రీ స్పీడ్: గంటకు24,500 మీటర్లు (అంటే మాక్ 32)
నేలకు దిగేది: అక్టోబర్ 10, 2022
స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్..
ప్రపంచలో అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇదే. మానవులకు అంతరిక్షంలోకి పంపేందుకు దీన్ని డిజైన్ చేశారు.
ఎత్తు: 322 ఫీట్లు
లిఫ్టాప్ సమయంలో బరువు: 5.75 మిలియన్ల పౌండ్లు
చంద్రుడిపైకి మోసుకెళ్లే బరువు: 59,000 పౌండ్లు
ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్
ఇది నెక్ట్స్ జనరేషన్ స్పేస్‌క్రాఫ్ట్, మానవుల్ని స్పేస్‌లోకి పంపేరీతిలో దీన్ని డిజైన్ చేశారు. \
సిబ్బంది, సర్వీస్ మాడ్యూల్ ఎత్తు: 26 ఫీట్లు
ప్రెజర్ వాల్యూమ్: 690.6 ఫీట్లు
చంద్రుడి వద్ద ఉండే బరువు: 53,000 పౌండ్లు
నేలపై దిగే సమయంలో ఉండే బరువు: 18,200 పౌండ్లు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

