Imran Khan: గంటలోగా ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టుకు తీసుకురండి: పాక్ సుప్రీంకోర్టు
Imran Khan: అరెస్టు అయిన ఇమ్రాన్ ఖాన్‌ను గంటలోగా కోర్టులో ప్రవేశపెట్టాలని ఇవాళ పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. అల్ ఖాదిర్ ట్రస్టీ కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)ను అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ కేసుపై విచారణ చేపట్టింది. గంటలోగా ఇమ్రాన్‌ను కోర్టులో ప్రవేశపెట్టాలని నేషనల్ అకౌంటబులిటీ బ్యూరోకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్థాన్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇమ్రాన్ అరెస్టుపై విచారణ చేపట్టింది. కోర్టు సరైన ఆదేశాలు ఇస్తుందని సీజేపీ తెలిపారు.
ఇమ్రాన్ అరెస్టు విషయంలో సీరియస్‌గా ఉన్నట్లు కోర్టు చెప్పింది. సుప్రీం ఆదేశాల తర్వాత ఆ కోర్టు ప్రాంగణంలో సెక్యూర్టీని పెంచేవారు. రేంజర్లు, బాంబు డిస్పోజ్ స్క్వాడ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇస్లామాబాద్ ఇన్స్పెక్టర్ జనరల్ డాక్టర్ అక్బర్ నాసిర్.. ఇవాళ ఇమ్రాన్ ఖాన్‌ను అత్యవసరంగా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

