ప్రపంచంలో రెండో లోతైన బ్లూ హోల్‌ను(సముద్రతీరంలో ఏర్పడే నీటి గుంత) మెక్సికో చెటుమల్ బేలోని యుకాటన్ ద్వీప కల్ప తీరంలో కనుగొన్నారు. లైవ్ సైన్స్ నివేదిక ప్రకారం ఈ బ్లూ హోల్ 900 అడుగుల లోతుతో 1,47,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఒక పబ్లిక్ రిసెర్చ్ సెంటర్ మొదట దీన్ని కనుగొంది.