Mariam Nabatanzi | న్యూఢిల్లీ: అరుదైన ఆరోగ్య కారణాల వల్ల గర్భనిరోధక గోలీలు వాడలేని పరిస్థితి ఆమెది. పైగా సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గించుకోవడానికి పిల్లలను కనాలని వైద్యులే సలహా ఇచ్చారు. ఫలితంగా 40 ఏండ్లు వచ్చే సరికి ఆమె 40 మందికి తల్లయ్యింది. ప్రపంచంలోనే అత్యధిక సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన ఆ ఉగాండా మహిళ పేరు మరియం నబటాంజీ.
12 ఏండ్ల వయస్సులో ఆమెకు పెండ్లయ్యింది. 13 ఏండ్లకే ఆమె మొదటిసారి కవల పిల్లలకు తల్లయ్యింది. ఆమె అండాశయాలు అసాధారణ పరిమాణంలో ఉండటం వల్ల ఆమె గర్భనిరోధక గోలీలు వాడితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పారు. పైగా ఆమె గర్భం దాల్చిన ప్రతిసారీ ఎక్కువ అండాలు విడుదలయ్యేవి.