Mother Killed Daughter, Chopped Body | కూతురిని చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికిన తల్లి.. ఫ్రిజ్‌లో దాచి కొన్ని భాగాలు కాలువలో పారవేత
Mother Killed Daughter, Chopped Body | ఒక తల్లి తన తొమ్మిదేళ్ల కూతురిని కత్తితో పొడిచి చంపింది. ఆ చిన్నారి మృతదేహాన్ని ముక్కలుగా నరికింది (Mother Killed Daughter, Chopped Body). ఆ భాగాలను ఫ్రిజ్‌లో దాచింది. కొన్ని భాగాలను వండింది. మరికొన్ని భాగాలను మురికి కాలువలో పడేసింది.
బ్రెసిలియా: ఒక తల్లి తన తొమ్మిదేళ్ల కూతురిని కత్తితో పొడిచి చంపింది. ఆ చిన్నారి మృతదేహాన్ని ముక్కలుగా నరికింది (Mother Killed Daughter, Chopped Body). ఆ భాగాలను ఫ్రిజ్‌లో దాచింది. కొన్ని భాగాలను వండింది. మరికొన్ని భాగాలను మురికి కాలువలో పడేసింది. ఈ దారుణ సంఘటన బ్రెజిల్ దేశంలో జరిగింది. సావో పాలోలో నివసిస్తున్న 30 ఏండ్ల రూత్ ఫ్లోరియానో తన ప్రియుడి నుంచి విడిపోవాలని నిర్ణయించింది. అయితే మరో వ్యక్తి ద్వారా జన్మించిన తొమ్మిదేళ్ల అలానీ సిల్వాను సొంత బిడ్డలా ఆమె ప్రియుడు చూసుకుంటున్నాడు. దీంతో అతడితో బ్రేకప్‌కు ఆ చిన్నారి ఒప్పుకోలేదు.
కాగా, కుమార్తె అలానీ అడ్డు తొలగించుకునేందుకు రూత్ ఫ్లోరియానో ప్లాన్ చేసింది. ఆ చిన్నారిని ఏ విధంగా అంతం చేయాలి అన్నది ఇంటర్నెట్లో శోధించింది. ఆగస్ట్ రెండో వారంలో ఉదయం బ్రెష్ చేస్తున్న కుమార్తె అలానీని కత్తితో పొడిచి హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచింది. ఇంటి సమీపంలోని మురికి కాలువలో కొన్ని భాగాలు పడేసింది. ఆగస్ట్ 15న కొత్త ఇంటికి మారింది.

Brazil Woman
మరోవైపు ఆగస్ట్ 26న రూత్ ఫ్లోరియానో ఇంట్లో లేని సమయంలో మాజీ ప్రియుడి తల్లి ఆమె ఇంటికి వచ్చింది. డ్రగ్స్, ఆయుధాలు దాచి ఉంటుందన్న అనుమానంతో ఫ్రిజ్ తెరిచి చూసింది. మానవ శరీర భాగాలు అందులో ఉండటం చూసి షాక్ అయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, రూత్ ఫ్లోరియానోను పోలీసులు ప్రశ్నించారు. అయితే కుమార్తె అలానీ సిల్వాను తాను చంపలేదని తొలుత బుకాయించింది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఒక వ్యక్తి ఆ రోజు తన ఇంటికి వచ్చినట్లు తెలిపింది. తామిద్దరం డ్రగ్స్ సేవించి నిద్రించినట్లు చెప్పింది. మేల్కొన్న తర్వాత కుమార్తె మరణించి ఉందని, దీంతో ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని ముక్కలుగా నరికి కొన్నింటిని ఫ్రిజ్‌లో దాచినట్లు వెల్లడించింది.
మరోవైపు పోలీసులు రూత్‌ను మరింతగా ప్రశ్నించారు. దీంతో డ్రగ్స్ మత్తులో ఉన్న తాను ఆగస్ట్ 8 అర్ధరాత్రి తర్వాత కూతురిని కత్తితో పొడిచి చంపినట్లు అంగీకరించింది. ముక్కలుగా నరికిన కొన్ని భాగాలను సమీపంలోని మురికి కాలువలో పడేసినట్లు తెలిపింది. నాశనం చేసేందుకు మరికొన్ని భాగాలను వండినట్లు చెప్పింది. అయితే హత్యకు గురైన చిన్నారి అలానీ సిల్వా పుట్టిన రోజు ఆగస్ట్ 6గా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు ముందు లేక తర్వాత ఆ చిన్నారి హత్యకు గురైందా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- body
- Brazil
- child's remains
- chopped
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

