అంతరిక్షంలో కోతుల సంభోగం.. సరికొత్త ప్రయోగానికి చైనా సిద్ధం
అంతరిక్షంలో సంభోగం సాధ్యమేనా? గురుత్వాకర్షణ రహిత స్థితిలో పెద్ద జీవుల పునరుత్పత్తి స్థితి ఎలా ఉంటుంది?
- గురుత్వాకర్షణ రహిత స్థితిలో పునరుత్పత్తి స్థితిని తెలుసుకునేందుకు పరిశోధన
బీజింగ్, నవంబర్ 6: అంతరిక్షంలో సంభోగం సాధ్యమేనా? గురుత్వాకర్షణ రహిత స్థితిలో పెద్ద జీవుల పునరుత్పత్తి స్థితి ఎలా ఉంటుంది? అన్న విషయాలు తెలుసుకొనేందుకు చైనా సిద్ధమవుతున్నది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే దూసుకుపోతున్న డ్రాగన్.. కొత్తగా ప్రారంభించిన న్యూ తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి కోతులను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. చైనా కోతులను న్యూ తియంగాంగ్ అంతరిక్ష కేంద్రంలోకి పంపి, గురుత్వాకర్షణ లేని చోట అవి ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకోనున్నది. ఆరు దశాబ్దాల నుంచి నిర్వహిస్తున్న అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటి వరకు ఏ దేశం చేయని పనిని చేసేందుకు చైనా పరిశోధకులు తహతహలాడుతున్నారు.
ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో సోవియట్ పరిశోధకులు ఎలుకలతో ఇలాంటి ప్రయోగం చేశారు. కానీ, అవి అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చాక కూడా గర్భం దాల్చలేదు. దీన్ని బట్టి గురుత్వాకర్షణ రహిత స్థితిలో వృషణాలు, ఇతర పునరుత్పత్తి అవయవాలు దెబ్బతింటాయని, జంతువుల సెక్స్ హార్మోన్లో గణనీయమైన క్షీణతకు కారణమవుతుందని పరిశోధకులు గుర్తించారు. తక్కువ రక్తపోటు వల్ల అంగస్తంభన సమస్యలు ఏర్పడుతాయని నిర్ధారించారు.
అయితే, ఈ గుట్టును ఛేదించేందుకు మానవులతో ఎక్కువ సారూప్యత గల కోతులను ప్రయోగించడమే సరైందని చైనా సైంటిస్టులు భావిస్తున్నారు. చంద్రుడు, అంగారక గ్రహం చుట్టూ కక్ష్యలో దీర్ఘకాల స్థిర నివాసం కోసం మరిన్ని దేశాలు ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో ఈ ప్రయోగం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే, కోతులను ఎన్క్లోజర్లలో ఎక్కువసేపు స్వేచ్ఛగా ఉంచడం కష్టసాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- experiment
- monkeys
- Space
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

