Sienna Weir | గుర్రపు స్వారీ చేస్తుండగా కిందపడి మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ మృతి
మిస్ యూనివర్స్ (Miss Universe) ఫైనలిస్ట్, ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ మోడల్ సియెన్నా వీర్ (Sienna Weir) మృతిచెందింది. 23 ఏండ్ల సియెన్నా గత నెల 2న గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయింది.
సిడ్నీ: మిస్ యూనివర్స్ (Miss Universe) ఫైనలిస్ట్, ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ మోడల్ సియెన్నా వీర్ (Sienna Weir) మృతిచెందింది. 23 ఏండ్ల సియెన్నా గత నెల 2న గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె.. అప్పటి నుంచి లైఫ్ సపోర్ట్‌పై ఉన్నది. అయితే గత నెలరోజులుగా చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోవడంతో.. ఆమె కుటుంబ సభ్యులు లైఫ్ సపోర్టును తీసేయాలని నిర్ణయించారు. దీంతో ఆమె కన్నుమూసింది. సియెన్నా.. 2022లో జరిగిన ఆస్ట్రేలియన్ మిస్ యూనివర్స్ పోటీలకు ఎంపికైన 27 మంది ఫైనలిస్టుల్లో ఒకరు.
ఇంగ్లిష్ లిటరేచర్తోపాటు సైకాలజీలో డబుల్ డిగ్రీ చేసిన ఆమె ఏప్రిల్ 2న సిడ్నీలోని విండ్సోర్ పోల్ గ్రౌండ్లో గుర్రపు స్వారీ చేస్తున్నది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గుర్రం కిందపడిపోయింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత మూడేండ్లుగా ఆమె గుర్రపు స్వారీ చేస్తున్నదని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

