లండన్, జూలై 7: మద్యంప్రియులకు శుభవార్త. ఎంత మద్యం సేవించినా హ్యాంగోవర్ రాకుండా నివారించే మాత్ర వచ్చేసింది. మిర్కిల్ అనే ఈ గోలి శరీరంలోని ఆల్కహాల్‌ను 70 శాతం వరకు విచ్ఛిన్నం చేస్తుంది. మద్యం సేవించిన తర్వాత హ్యాంగోవర్ ప్రభావాలను గణనీయంగా తగ్గిస్తుంది.
మద్యం సేవించడం వల్ల డీ హైడ్రేషన్ ప్రభావంతో తలనొప్పి, వికారం, అలసట కారణంగా హ్యాంగోవర్ వస్తుంది. మిర్కిల్ మాత్రలోని విటమిన్ బీ12, బాసిల్లస్ కోయెగులన్స్, బాసిల్ల్లస్ సబ్టిలిస్, అమైనో ఆమ్లం, ఎల్-సైస్టిన్.. ఆల్కహాల్‌ను నీరు, కార్బన్డైయాక్సైడ్గా విభజించడంలో సహాయ పడతాయి. మిర్కిల్ మాత్రలను యూకేలో విక్రయిస్తున్నారు.