క్వెట్టా: పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్(Balochistan)లో ఇటీవల తిరుగుబాటు దళాలు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో తీవ్ర రక్తపాతం చోటుచేసుకున్నది. ఇరు వైపుల భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. అయితే నిషేధిత బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తాజాగా మహిళా ఫిదాయిన్ల ఫోటోలను రిలీజ్ చేసింది. తమ దళానికి చెందిన ఇద్దరు మహిళా సూసైబ్ బాంబర్లు భారీ దాడుల్లో పాల్గొన్నట్లు బీఎల్ఏ పేర్కొన్నది. ఆ ఇద్దరిలో ఒకరి పేరు హవా బలోచ్. ఆమె తండ్రి కూడా బీఎల్ఏ ఫైటర్. 2021లో పాకిస్థాన్ భద్రతా దళాల చేతిలో అతను హతమయ్యాడు. ఇక మరో ఫైటర్‌ను అసిఫా మెంగాల్గా గుర్తించారు. 2002లో ఆమె పుట్టింది. ఇటీవల నుషిక్‌లోని ఐఎస్ఐ క్యాంపుపై జరిగిన సూసైడ్ దాడిలో ఆమె పాల్గొన్నట్లు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది.
జెన్ జెడ్ కేటగిరీకి చెందిన మహిళలుగా వారిని గుర్తిస్తున్నారు. ఆ ఇద్దరూ మంచి విద్యావంతులే. తిరుగుబాటు దళంలో చేరడానికి ముందు ఆ ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసించారు. కానీ ఎన్నో ఏళ్లుగా సాగుతున్న బలోచ్ వేర్పాటువాద ఉద్యమంలో యువత, చదువుకున్న అమ్మాయిలు కూడా పాలుపంచుకుంటున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఎల్ఏ దళాలు పోరాటం చేస్తున్నాయి. పాక్ ఆర్మీపై దాడి చేసిన ఇద్దరు మహిళా బాంబర్ల ఫోటోలను రిలీజ్ చేస్తున్నట్లు బీఎల్ఏ అధికారికంగా ప్రకటించింది. పాకిస్థాన్ భద్రతా బలగాలను టార్గెట్ చేసేందుకు హిరాఫ్(బ్లాక్ స్టార్మ్) ఆపరేషన్ చేపట్టినట్లు బీఎల్ఏ చెప్పింది.
Baloch Liberation Army Video:
“During Operation Herof, Phase Two at the Gwadar Front, Fidayee Hawa Baloch fought selflessly, shoulder to shoulder with fellow Fidayeen. This was her final message, sent twelve hours before her martyrdom.” pic.twitter.com/tedajNIjkD
— Aditya Raj Kaul (@AdityaRajKaul) February 2, 2026