హవానా: క్యూబా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా మిగుల్ డియాజ్ కనెల్ కొనసాగుతారని సోమవారం ఆ పార్టీ ప్రకటించింది. డియాజ్ కనెల్ వయసు 60 ఏళ్లు. ఆ పార్టీ కార్యదర్శి పదవికి రౌల్ క్యాస్ట్రో రెండు రోజల క్రితం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2018లో క్యూబా దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డియాజ్.. ఇక కమ్యూనిస్టు పార్టీ లీడర్‌గా కూడా కీలక బాధ్యతలను కొనసాగనున్నారు. 1959 నుంచి క్యూబా కమ్యూనిస్టు పార్టీకి ఫిడేల్, రౌల్ క్యాస్ట్రోలు నాయకత్వం వహించారు. ఆరు దశాబ్ధాల తర్వాత ఆ పార్టీ ఇప్పుడు మరో కొత్త తరం నాయకుడి చేతుల్లోకి వెళ్లింది. క్యాస్ట్రో సోదరులకు, వారి ఆర్థిక విధానాలకు డియాజ్ నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు. కొత్త రకం నాయకులకు పార్టీ పగ్గాలను అప్పగించనున్నట్లు గత శుక్రవారం రౌల్ క్యాస్ట్రో ప్రకటించిన విషయం తెలిసిందే.