మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మందికి ఉద్వాసన!
మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల కుదింపు, మరోవైపు ఏఐ సాంకేతికతపై భారీ పెట్టుబడులు.. ఈ రెండింటి నేపథ్యంలో సంస్థ సీఈవో సత్య నాదెళ్ల గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో రెండు లక్షల మంది ఉద్యోగులతోపాటు 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఏఐ ఏజెంట్లు కలిసి పనిచేసే పరిస్థితి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
- 2 కోట్ల ఏఐ ఏజెంట్లతో పనిచేసేందుకు ప్రణాళిక
- సంస్థ సీఈవో సత్య నాదెళ్ల విజన్!
శాన్ఫ్రాన్సిస్కో: మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల కుదింపు, మరోవైపు ఏఐ సాంకేతికతపై భారీ పెట్టుబడులు.. ఈ రెండింటి నేపథ్యంలో సంస్థ సీఈవో సత్య నాదెళ్ల గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో రెండు లక్షల మంది ఉద్యోగులతోపాటు 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఏఐ ఏజెంట్లు కలిసి పనిచేసే పరిస్థితి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థలో సుమారు 60 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వైదొలిగే అవకాశం కల్పిస్తూ ప్రకటించిన పథకం వెలువడిన కొద్ది రోజులకే ఈ వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఏడాది జూన్‌లో లింక్డ్ ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్హాఫ్మన్తో కలిసి ’పాసిబుల్’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. మనుషులతో కలిసి పనిచేయనున్న లక్షలాది ఏఐ ఏజెంట్లు భవిష్యత్తులో సంస్థలు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఏఐ ఏజెంట్లను ఉద్యోగుల తరహాలో ఉపయోగించుకునే అవకాశం ఉందా? అని హాఫ్మన్ నాదెళ్లను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆయన ఆఫీసుల్లో కంప్యూటర్ల వినియోగం పెరిగిన తొలినాళ్లను గుర్తుచేశారు. 1980వ దశకంలో ప్రతిరోజూ ఉదయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కంప్యూటర్లపై టైప్ చేస్తారని ఊహించడం కూడా కష్టంగా ఉండేదని పేర్కొన్నారు. ఇదే తరహాలో భవిష్యత్తులో ఏఐ ఏజెంట్లు ఆఫీసుల్లో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
60 వేల మందికి వీఆర్ఎస్ అవకాశం
మైక్రోసాఫ్ట్ అక్టోబర్ 26న సుమారు 60 వేల మంది ఉద్యోగులకు వర్తించే స్వచ్ఛంద నిష్క్రమణ పథకాన్ని ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం ఏఐ ఆధారిత ఉద్యోగాల కోతలో భాగమని మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించలేదు. సంస్థలో మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా విభాగాలు తమ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకునేందుకు ఇది మరో అవకాశమని చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మన్ వివరించారు.
ఉద్యోగులకు కొత్త సవాళ్లు
ఏఐ విస్తరణతో ఉద్యోగులకు ఎదురయ్యే సవాలు కేవలం కొత్త సాంకేతికతను నేర్చుకోవడం మాత్రమే కాదు. స్వతంత్రంగా పనిచేసే ఏఐ వ్యవస్థలు తమ ప్రస్తుత ఉద్యోగాల స్వరూపాన్ని ఎలా మారుస్తాయి? భవిష్యత్తులో ఎలాంటి నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతుంది? వేతనాలు, కెరీర్ అవకాశాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అనే అంశాలను కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. మొత్తంగా చూస్తే, ఏఐ సాంకేతికత కార్యాలయాల్లో సహాయక సాధనంగా ఉండే దశ నుంచి స్వతంత్రంగా పనులు నిర్వహించే ఏజెంట్ల దిశగా అడుగులు వేస్తోంది. ఈ పరిణామం కొత్త అవకాశాలను సృష్టిస్తుందా? లేక సంప్రదాయ ఉద్యోగాలపై ఒత్తిడి పెంచుతుందా? అన్నది రాబోయే కాలంలో తేలనుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

